Medak

News March 26, 2024

28న ఓయూ వార్షిక బడ్జెట్..

image

ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 26, 2024

KCR ఇలాకా గజ్వేల్‌లో నువ్వా-నేనా?  

image

మాజీ సీఎం KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తోంది. BRS అధికారంలో ఉన్న దశాబ్దకాలంగా స్తబ్దుగా ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ పీఠం కదలడంతో చోటుచేసుకున్న పరిణామాలతో వారిలో వేగంగా మార్పులు వచ్చాయి. గజ్వేల్‌ మాజీ MLA, కాంగ్రెస్ నేత తూంకుంట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌, BRS నేత ప్రతాప్‌రెడ్డి నువ్వా నేనా అన్నట్లు ఉండడంపై స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది.

News March 26, 2024

సంగారెడ్డి: తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళిక

image

జిల్లాలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నామని మిషన్ భగీరథ ఈఈ SK పాషా తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉంటే మిషన్ భగీరథ కార్యాలయంలోని కంట్రోల్ రూం నంబర్ 9441125797కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సెలవు దినాల్లో మినహా ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఫిర్యాదులను రోజువారీగా నమోదు చేసి పరిష్కరిస్తామన్నారు.

News March 25, 2024

సిద్దిపేట: లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరి మృతి

image

బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివారు రాజీవ్ రహదారి మీద ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాజకుమారి మృతి చెందినట్లు SI కృష్ణారెడ్డి తెలిపారు. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 25, 2024

సిద్దిపేట: కారు కొనివ్వలేదని సూసైడ్..!

image

చేర్యాలలో సోమవారం విషాదం నెలకొంది. కారు కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న నవీన్ ఇటీవల కారు కొనివ్వాలంటూ తండ్రితో గొడవపడ్డాడు. డబ్బులు జమ చేసి ఫైనాన్స్‌లో కొందామని తండ్రి నర్సింహులు సర్ది చెప్పినప్పటికీ వినిపించుకోనట్లు తెలుస్తోంది. పని మానేసిన అతడు మనస్తాపంతో అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 25, 2024

దుబ్బాకలో హోలీ పండుగ రోజే విషాదం..! 

image

ప్రమాదవశాత్తు కాలుజారి బిల్డింగ్‌ పై నుంచి పడిన వ్యక్తి చనిపోయిన సంఘటన దుబ్బాకలో చోటుచేసుకుంది. SI గంగరాజు వివరాల ప్రకారం.. చల్లాపూర్‌కి చెందిన లింగం (27) దుబ్బాక పట్టణంలో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం చెత్త కవర్‌ను బాల్కానీ నుంచి విసిరేయబోయి కాలు జారి కింద పడిపోయాడు. తలకు గాయమవగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

News March 25, 2024

సంగారెడ్డి: వారంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఎలా..?

image

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆర్థిక సంవత్సరం ముగింపులో విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులను విద్యా సంవత్సరం మధ్యలో విడుదల చేయాల్సి ఉన్నా పాఠశాలల మూతపడే ముందు విడుదల చేసింది. శనివారం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే నిధులు వెనక్కి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

News March 25, 2024

మెదక్ జిల్లాలో వృద్ధుడి దారుణ హత్య

image

మెదక్ జిల్లా కౌడిపల్లి శివారులో గల బతుకమ్మ తండా సమీపంలో వృద్ధుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్యం భూమయ్య(70) ఆదివారం రాత్రి తన వ్యవసాయ పొలం దగ్గర హత్యకి గురయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలీంచారు. క్లూస్ టీంతో కలిసి సమాచారం సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2024

పెద్దశంకరంపేట: నీట మునిగి గొర్రెల కాపరి మృతి

image

పెద్ద శంకరంపేట మండలం కొప్పల్ శ్రీ ఉమా సంగమేశ్వర ఆలయ సమీపంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో నీట మునిగి గొర్రెల కాపరి చౌదరిపల్లి రాజు(32) మృతి చెందాడు. నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన రాజు గొర్రెలు మేపడానికి నిన్న నిజాంసాగర్ వైపు వచ్చాడు. బ్యాక్ నీళ్లలో ఈత కోసం వెళ్లి గల్లంతయ్యాడు. ఈరోజు మృతుడి శవాన్ని బయటకు తీయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2024

మెదక్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ !

image

మెదక్‌ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన BRS.. నియోజకవర్గంలో తన కార్యాచరణను ప్రారంభించింది. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఒకటైన మెదక్‌‌పై కేసీఆర్ దృష్టిసారించారు. రేపటి నుంచి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యనేతలతో KCR సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటూ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన హరీశ్‌రావు.. మెదక్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.