India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MDK: వర్షాకాలం పంటలు ప్రారంభం అయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నాటు వేసే కూలీలు కూలీ రేట్లు పెంచారు. గతంలో రూ.400 ఉన్న కూలీలు ఇప్పుడు రూ.500 లేదా రూ.550 కూలీకి వస్తున్నారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 50% నాట్లు పూర్తయ్యాయి. కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో ఎక్కువ రేట్లతో కూలీలను తీసుకుపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే దీనికి ముఖ్య కారణం అని వారు చెబుతున్నారు.
పాపన్నపేట: నేరస్థులు తప్పు చేయాలంటే భయపడాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ధైర్యం నింపాలన్నారు. ముఖ్యంగా డయల్ 100 వ్యవస్థపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
సెల్ ఫోన్ పోగొట్టుకున్న, దొంగలించబడిన సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. సెల్ ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేస్తే సంబంధిత దుకాణ యజమాని నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. దొంగలించిన సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
317 జీవోపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం అయ్యింది. గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించింది. ఎవరికైతే 317 జీవోలో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్16 ఎంపికలు ఈనెల 28న జూబ్లీ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 1-9-2008 నుంచి 31-8-2010 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో అద్భుతంగా ఆడి తెలంగాణ పేరు నిలబెట్టాలని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ సూచించారు. 15 రోజులుగా సిద్దిపేటలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ ఎంపిక, శిక్షణ శిభిరం ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో చిరుతపులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి గ్రామానికి చెందిన కొత్తగారి రమేశ్ తన వ్యవసాయ పొలం వద్ద పశువును కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఆ పశువుపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రమేశ్ గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లాలో చిరుత సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు.
రైతు రుణమాఫీ అంశంపై MLA హరీశ్‌రావు X వేదికగా స్పందించారు. ‘DEC 9న రుణమాఫీ చేస్తామని 7నెలల తర్వాత ప్రక్రియను ప్రారంభించడంతో రైతులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. 7నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారు. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. శివంపేట్ మం. చెందిన ఓ రైతు క్రాప్ లోన్‌ను, రూ.9వేలు మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు’అని అన్నారు.
సిద్దిపేట జిల్లా <<13707142>>లింగారెడ్డిపల్లిలో <<>>ట్రాక్టర్ కిందపడి రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. గ్రామానికి చెందిన యువతి(22) HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. రైతు సత్యంతో ఏడాదిన్నర నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సత్యం మృతి చెందిన కాసేపటికే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తోంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.272 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 13.899 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా 1444 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో జూన్ నుంచి అర టీఎంసీ నీరు వచ్చినట్లు ఏఈ తెలిపారు.
Sorry, no posts matched your criteria.