India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదన్నారు. తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ పురుషులకు ఆగస్టు 5 నుంచి నెలరోజుల పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ వంగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గ్రామీణ నిరుద్యోగ యువకులు వినియోగించుకుని, శిక్షణలో వసతి, భోజనం, కోర్సు మెటీరియల్ పూర్తి ఉచితంగా ఉంటుందని, శిక్షణ అనంతరం సర్టిఫికేట్లతో పాటు టూల్ కిట్ ఇస్తామన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని విమర్శనాత్మకంగా ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సాధించింది గుండు సున్నా’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని సిద్దిపేటలో కొన్ని చోట్ల BRS నాయకులు ప్రదర్శనగా పెట్టారు. మోడ్రన్ బస్టాండ్ వద్ద ఈ ఫ్లెక్సీ ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి ఎలాంటి నిధులు సాధించలేదని విమర్శించారు.
రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హత్నూర గురుకులంలో రేపు బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 10వ తరగతి 2024 మార్చిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెడుతోంది. ఈ పద్దుపై ఉమ్మడి మెదక్ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి నిధులివ్వాలంటున్నారు. పొన్నం, దామోదర, కేసీఆర్, హరీశ్ ఉండటంతో జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది మండలం తనికిళ్ల తండా వద్ద నాందేడ్- అకోలా జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ పట్టణం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్లు నీరుడి రాము, యం.రవి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతోపాటు ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు అందడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా తప్పవని హెచ్చరించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ పార్లమెంట్ పరిధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో ఆదాయం లభిస్తుందన్న ఆశతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.98.40 లక్షలు పోగొట్టుకున్నాడు. పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాలు.. AR బృందావనం కాలనీలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫోన్‌కు గత నెల 17న ఓ మెసేజ్ వచ్చింది. లింక్ క్లిక్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసేందుకు ముందుగా రూ.10వేలతో ప్రారంభించి, విడతల వారీగా రూ.98.40లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. జర జాగ్రత్త!
కేంద్ర బడ్జెట్‌లో మెదక్ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేవు. మొండి చేయి చూపించడంతో మెదక్ ప్రజలు నిరాశకు గురయ్యారు. కేంద్రీయ, నవోదయ పాఠశాలల మంజూరు కాలేదు. అలాగే అత్యవసరంగా నిర్మించాల్సిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలకు కేటాయింపులు లేవు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం పర్యటక అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడంపై జిల్లా వాసుసు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.