India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో ఓ బాలిక వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. 15 ఏళ్ల వయసు గల బాలిక వివాహం గ్రామంలో జరుగుతుందన్న సమాచారం మేరకు ఐసీడీఎస్ సీడీపీఓ కరుణ శీల, సూపర్వైజర్ సంతోష, కొల్చారం పోలీసుల సహాయంతో గ్రామానికి చేరుకొని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. సదరు బాలికను మెదక్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.
సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ రీజియన్ కోఆర్డినేటర్ భీమయ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను https://WWW. TSWREIS.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దుబ్బాక పట్టణంలో రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు ఇరు వర్గాలుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. రేకులకుంట, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో బాధ్యులు, మరికొంత మందిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరణ ఇచ్చారు.
రానున్న ఏప్రిల్, మే నెలలో తాగునీటి సమస్య లేకుండా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నూతన ఛైర్ పర్సన్‌గా మామిండ్ల జ్యోతికృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఛైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించారు. గత ఛైర్మన్(BRS)పై అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇందులో గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కుల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా సిబ్బంది విధి నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన ఆయన.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామంలో దుబ్బగళ్ళ సంగమ్మ(44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొద్ది నెల క్రితం భర్త మృతిచెందగా.. కొడుకు హైదరాబాదులో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి ఇంట్లో పడుకున్న సంగమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
చౌటకూర్ మండల కేంద్రంలో గురువారం ఎంపీ, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్ సీటును నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఇందుకు బూత్ స్థాయి కార్యకర్తలే అత్యంత కీలకమన్నారు. పదేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.
ఘణపురం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. పాలకుల నిరాదరణతో పూర్వ వైభవం కోల్పోయింది. నిజాం కాలంలో కళకళలాడిన ప్రాజెక్టు నేడు పూడికతో నిండిపోయింది. ప్రాజెక్టు నిండినా వారం రోజులు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం 2016లో రూ. 43.64 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నాలుగేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
Sorry, no posts matched your criteria.