India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ పట్టణంలో ఉన్న ఒకే రోడ్డు వివిధ ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ల నిర్మాణానికి మట్టి, స్టోన్‌డస్ట్, కంకర తరలించే టిప్పర్లు, కంపెనీలకు వెళ్లే భారీ కంటెయినర్లు రాకపోకలు, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా 2 రోజుల కింద రాందాస్ చౌరస్తాలో రోడ్డ దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. రింగ్ రోడ్డు లేకపోవడం ఈ సమస్యకు పరిష్కారమని ప్రజలు కోరుతున్నారు.

మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10.30 గంటల నుంచి మ.1.30 గంటల వరకు జిల్లాస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి పరిష్కరిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ లెక్క జరుపుకోవడం సంతోషకరమని, కులం, మతం, జాతి విబేధాలు లేకుండా ఒక సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ పాపన్న అన్నారు.

రైతులకు రుణమాఫీ చేయడం KTR, హరీశ్‌రావుకు ఇష్టం లేదా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. KTRకు రాజకీయ నాలెడ్జ్ లేక ప్రజలను రెచ్చగొడుతున్నారని, హరీశ్‌రావు సీనియరై కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణాలపై బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.

ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం రుణమాఫీ చేశాం హరీశ్ రావు రాజీనామా సవాల్ ఏమైందని గుర్తు చేశారు. మరోపక్క హరీశ్ రావు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా. ? రూ.17,869 కోట్లే అవుతాయా? రుణమాఫీ అబద్ధమని తిప్పి కొట్టారు. ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో?

‘ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం.. సవాల్ విసిరిన హరీశ్‌రావు రాజీనామా చేయమంటే నాటకాలాడుతున్నారు’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన HYD గాంధీభవన్‌లో మాట్లాడారు. గత BRS సర్కార్ రూ.లక్ష రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తే బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదని విమర్శించారు. ఇకనైనా హరీశ్ రావు నాటకాలు ఆపాలన్నారు.

చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా ములుగు(M)కి చెందిన భానుప్రియ కుటుంబ కలహాలతో శనివారం ఉదయం పిల్లలతో ఇంటి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నిన్న రాత్రి శామీర్‌పేట చెరువులో వేదాంశ్(5), భానుప్రియ మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్, హరీశ్ రావు అధికార కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్‌గా ఉండిపోవడంతో కేటీఆర్, హరీశ్ రావును కట్టడి చేస్తే చాలు.. కాంగ్రెస్ పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్నారు. అందుకే మిగిలిన నేతలను పక్కనపెట్టి ఇద్దరిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లడమే సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. ఇద్దరిని టార్గెట్ చేయాలని కేడర్‌కు సందేశం పంపారని టాక్ నడుస్తోంది.

ఓయూ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పీజీ కోర్సుల బ్యాక్‌లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీలోగా చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలకు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్కతో కలిసి పోడు భూములపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.