India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లాలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైంది. కాగా మెదక్, జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS-8, కాంగ్రెస్- 5, BJP- 1 చోట విజయం సాధించాయి. కామారెడ్డిలో గెలిచిన బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మెదక్ BJP అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులతో పాటు ఆయా మోర్చాల నాయకులు, శక్తి కమిటీలు, బూత్ కమిటీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పోలీసులమంటూ బెదిరించి బంగారు అపహరించిన ఘటన సంగారెడ్డి మండలం చక్రియాలలో జరిగింది. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు బైకుపై సంగారెడ్డి నుంచి చక్రియాల వెళ్తుండగా MNR వద్ద నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ ఆపారు. కత్తితో బెదిరించి వారి వద్దనున్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో గాలివాన రెండు ప్రాణాలు బలిగొంది. గజ్వేల్ మండలం <<12886470>>కొల్గూర్<<>>కు చెందిన పదోతరగతి విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జాజితండాలో మాన్‌సింగ్-మంజుల కుమార్తె సంగీత (6) సోమవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన గాలికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీకొంది. తీవ్రగాయాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పట్టుబడిన నగదుకు సంబంధించిన ఆధారాలను గ్రీవెన్స్ కమిటీకి చూపి తీసుకువెళ్ళొచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలను వెంట పెట్టుకోవాలని చెప్పారు. 10 లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఐటి శాఖకు సమాచారం అందిస్తామన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని గౌతమ్‌నగర్ సమీపంలో మూత పడ్డ పరిశ్రమలో వున్న నీటి గుంతలో నీట మునిగి నిహద్ (10) అనే బాలుుడు మృతి చెందాడు. నలుగురు చిన్నారులు నీటి గుంత వద్దకు ఈతకు వెళ్లగా ఓ చిన్నారి గడ్డపై కూర్చున్నాడు. నీటి గుంతలోకి దిగిన మరో ఇద్దరు రాహుల్ (14), ఫైసల్ (5)లను స్థానికులు రక్షించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
గజ్వేల్ మండలం కొల్గూరులో విషాధచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి చింటూ(15) వ్యవసాయ పొలం వద్ద గల పశువులను ఇంటికి తీసుకువస్తుండగా, భారీ గాలికి చెట్టు విరిగి అతడిపై పడింది. ఈ ప్రమాదంలో చింటూ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం – మాసాయిపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్లోంచి పడి గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రయాణిస్తున్న రైల్లోంచి పడి యువకుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కాడు. ఓ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేయగా మైనింగ్ శాఖ నుంచి రిలీజ్‌కు అనుమతిచ్చారు. స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ ఆయన ఆధ్వర్యంలో డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్‌ను పట్టుకుని విచారిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.