India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వివరాలకు ఓయూ అధికారిక వెబ్సైట్ చూడాలన్నారు.

పేద విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష విధానంలో జాతీయ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఉపకార వేతనాలు పొందడానికి 8వతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు bsc.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నకలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించాలి. ఎంపికైన విద్యార్థులకు 9-12వ తరగతి వరకు ఏటా12 వేల చొప్పున 48వేల ఉపకారవేతనం అందుతాయి.

శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొంగిలేటి, తదితరులు పాల్గొన్నారు.

కంది మండల కేంద్రంలోని ఐఐటీహెచ్‌లో 18న ఫ్యూచర్ ఇన్వెంటరీ ఫెయిర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐఐటీహెచ్ అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు సాంకేతిక పురోగతి, సృజనాత్మకత వనరుల వంటి విభిన్న ప్రాజెక్టులను, సరికొత్త ఆలోచనలతో కూడిన ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

HYDలో హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీMLA మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్‌రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామ్ చెయ్.. రుణమాఫీ అయిపోయే..నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్‌పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

మూడో విడత రుణమాఫీ(రూ.1.5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మెదక్ జిల్లాలో 53,479 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 2 విడుతల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా 3వ విడత నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 53,479 మంది రైతులకు రూ. 710.22 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్యవైశ్యులందరికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం రాత్రి సిద్దిపేటలోని ఆర్యవైశ్య భవనం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత, బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

రుణమాఫీ హామీపై మాట తప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేననే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డి నిరూపించుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని మండిపడ్డారు.

రుణమాఫీ అందరికీ కాలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటోందని BRS నేత, నారాయణఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేటలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎవ్వరిని అడిగినా రుణమాఫీ కాలేదనే చెబుతున్నారని, మరి ఎవరికి మాఫీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని, పథకాలు అందించిన BRS కావాలా.. మోసం చేసిన కాంగ్రెస్ కావాలా అని అడిగారు.

మెదక్ డైట్లో అతిథి అధ్యాపకులుగా 16 పోస్టులు ఉన్నాయని, వాటికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ డీఈవో రాధాకిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లోని వివిధ విభాగాల్లో 16 పోస్టులు ఉన్నాయని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా డైట్లో అందజేయాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.