India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీఆర్ఎస్ కరవు, వర్షపాతానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరవుకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదని, అది ప్రకృతి ప్రభావం అని పేర్కొన్నారు. ప్రకృతిలో ఏర్పడ్డ ఇబ్బందులకు ఎవరూ బాధ్యులు కారన్నారు. వేసవిలో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఏడుపాయల చెక్‌డ్యామ్‌లో మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలానికి చెందిన సిద్ధిరాములు(31) వన దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. చెక్ డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు SI వెల్లడించారు.
ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొత్త కాపు నరేందర్ రెడ్డి(53) చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం చింతకాయలు తెంపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందగా.. కుటుంబీకులు రాత్రి గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి BRS అధినేత KCRకు అసలైన గిఫ్ట్ ఇద్దామని ఆ పార్టీ శ్రేణులకు సంగారెడ్డి MLA చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినంత మాత్రాన శ్రేణులు నిరాశ చెందొద్దని, ఈసారి గెలుద్దామన్నారు.
జహీరాబాద్ మం. తూముకుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యమైనట్లు రూరల్ SI ప్రసాద్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫారెస్ట్ అధికారులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. 60 నుంచి 65 సంవత్సరాల మధ్యగల వృద్ధుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకల మాత్రమే మిగిలినట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరణ ఇచ్చారు.
షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి హత్య చేసిన సంఘటన మెదక్ మండలం రాజ్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవమ్మ(58)తో తన కుమరుడు నారాయణ షాంపూ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తల్లిని ఇటుకతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడు మెదక్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
మాజీ సీఎం KCR సన్నిహితుడు, నర్సాపూర్ మాజీ MLA మదన్ రెడ్డి BRS పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తారని ఇవ్వకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. కాంగ్రెస్ నేత, మాజీ MLA మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని టాక్. కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే చేరుతా అన్నారని సమాచారం.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న చెరువులో పడి ఇద్దరి యువకులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హోలీ సంబరాల్లో భాగంగా సూరారం గ్రామానికి చెందిన శ్రావణ్ (17), శంకర్ (22) తమ మిత్రులతో కలిసి వీరన్నగూడెం చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Sorry, no posts matched your criteria.