India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో గ్రామస్థులు నిరసన చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా సంగారెడ్డి కెనాల్ నిర్మాణం కోసం అధికారులు గ్రామంలో సర్వే చేయడానికి వచ్చారు. దీంతో రైతులు వారిని అడ్డుకొని స్థానిక పంచాయతీ కార్యాలయంలో బంధించారు. కెనాల్ నిర్మాణానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పారు.

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలల్లో త్రాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తన కొడుకును వెతికి పెట్టాలని మెదక్ మండలం మగ్దూంపూర్ గ్రామానికి చెందిన బండలకాడి పోచయ్య సోమవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మురళి వివరాల ప్రకారం.. పోచయ్య కొడుకు చిన్నకృష్ణ ఈనెల 8న అత్తవారింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని, తన కొడుకు ఆచూకీ వెతికి పెట్టాలని తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కల్హేర్ మండలం బీబీపేట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పాఠశాల HM నర్సింగ్‌ను విధుల నుంచి తొలగించినట్లు DEO వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు. పాడైన గుడ్లను పరిశీలించకుండా, నిర్లక్ష్యంగా, ఉడికించి వడ్డించడంతో తిన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖేడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

రూ.2లక్షల రుణమాఫీకి అర్హత ఉన్నా తమకు మాఫీ కాలేదని ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు రైతులు బ్యాంకులు, అధికారుల చూట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను రైతు రక్షణ సమితి నేతలు కోరారు. ప్రభుత్వం చేపట్టిన రెండు విడతల రుణమాఫీలో సగం మంది రైతులకు లబ్ధి చేకూరలేదని అన్నారు. మూడో విడతలోలైనా అర్హులకు రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణపై జిల్లా అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు.

గ్రేడ్-1, 2, 3లో 1000 లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ ఛైర్మన్ డా. రియాజ్‌ను లైబ్రేరియన్ విద్యార్థులు కోరారు. డా.రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ డెవలప్‌మెట్ ఫోరం HYDలో నిర్వహించిన వన్ డే వర్క షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేలా చూస్తామన్నారన్నారు.

ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా బుదేరాకు చెందిన చాకలి గోపాల్(44) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి నాయనమ్మ చనిపోవడంతో నిద్ర చేయడం కోసం శనివారం ఏడుపాయలకు వచ్చారు. ఆదివారం ఉదయం స్నానం చేసేందుకు చెక్ డ్యాం వద్దకు వెళ్లిన గోపాల్ ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదైంది.

జిల్లాలోనే మనోహరాబాద్ మండలం కాళ్లకల్, జీడిపల్లి, కూచారం, ముప్పిరెడ్డిపల్లి, దండుపల్లి, రంగాయపల్లిలో అత్యధిక పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ స్థానికులు, ఇతర రాష్ట్రాల వారు ఉపాధి కోసం వచ్చి ఉంటారు. కొందరు డబ్బులు సంపాదించాలని నేరాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రజలు నిత్యం వెళ్లే ప్రదేశాల్లోనే ఈ ఘటనలు జరగడంతో ఆయా గ్రామాల వారు రాత్రి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.

సంగారెడ్డి జిల్లా పోలీసులు భారీగా గుట్కా పట్టివేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి హైదరాబాద్‌కు గుట్కాను లారీలో తరలిస్తుండగా జహీరాబాద్‌లో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడింది. రూ.45 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు. డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.