India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదవ తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానుండగా ఒత్తిడికి గురికావద్దని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని టెన్త్ విద్యార్థులకు డీఈవో వెంకటేశ్వరులు సూచించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోన్లు ,స్మార్ట్ వాచ్ ,ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లొద్దని అన్నారు.
పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో సంగం ప్రేమానందం(45)ను కొడుకు సందీప్ కొట్టి ఉరివేసి హత్య చేసినట్లు SI నరేశ్ తెలిపారు. తాగుడుకు బానిసైన ప్రేమానందం తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు పంచాయతీ నిర్వహించిన మార్పు రాకపోగా బుధవారం మళ్లీ గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన కొడుకు సందీప్.. తండ్రిని కొట్టి ఉరేసి చంపేశాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల నియామవళి అమలు వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన జిల్లా యంత్రాంగం సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాల గోడ పత్రికలు, ఫ్లెక్సీలను తొలగింపజేశారు. సంగారెడ్డి పట్టణ పరిధి పోతిరెడ్డిపల్లి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇలా ముసుగు వేశారు. బహిరంగ ప్రదేశాల్లో వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, హార్డింగ్, కటౌట్లు కూడా తొలగిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదన్నారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఆయన సూచించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ రేపు ప్రజావాణి నిర్వహించారు.
SHARE IT
పటాన్‌చెరు మం. రుద్రారం శ్మశానవాటిక సమీపంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రుద్రారం కారోబార్ రాజు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి 45-50 వయసు ఉంటుందని గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని SP రూపేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సెంటర్‌లకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దారిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కొమ్మ మింటూ అనే (16) బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది. శనివారం ఊరి శివారులోని చెరువులో దూకేశాడు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల 12 వేల 858 మంది ఉన్నారు. ఇందులో 8,95,777 పురుషులు, 9,16,876 మహిళలు, 205 ఇతరులున్నారు. సెగ్మెంట్‌లో సిద్దిపేటలో 2,36,474, మెదక్‌లో 2,16,748, నర్సాపూర్‌లో 2,26,154, సంగారెడ్డిలో 2,47,338, పటాన్‌చెరులో 4,07,419, దుబ్బాకలో 19,9,236, గజ్వేల్‌లో 2,79,489 మంది ఓటర్లున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 764 పోలింగ్ కేంద్రాలున్నాయి.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తి మీద సాము లాగా మారనుంది. మెదక్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేదా అతని భార్య నిర్మలను పోటీలో నిలపాలని అనుకుంటున్నారు. ఇదే స్థానంపై మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్ సైతం పోటీ చేయాలని చూస్తున్నారు. సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య(55) శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు వేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ నడవకపోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.