India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన దుబ్బాక మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. బొప్పాపూర్ గ్రామానికి చెందిన పరశురాములు మద్యం సేవించి భార్యపిల్లలతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 13న చిన్న కూతురు మంగతో గొడవపడగా, 14న గ్రామస్థుల ఎదుట తప్పు ఒప్పుకొని మంచిగా ఉంటానని హామీ ఇచ్చాడు. అదే రోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లి కనిపించలేదు. ఈ రోజు పల్లె ప్రకృతివనం వద్ద ఉరివేసుకున్నాడు.
ముస్లింలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక అని, విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తుచేసుకోవటమే మొహర్రం పండుగ ప్రత్యేకత అన్నారు. మానవజాతి త్యాగం ఎంతో గొప్పదని, మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే ఈ పండుగ అని ఆయన పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని గొడ్డలితో కొడుకు నరికి చంపేసిన ఘటన కంగ్టి మండలం చౌకన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొడ్డే మారుతి (65)ను, ఆయన కొడుకు నరసప్ప (20) గొడ్డలితో నరికి హతమార్చాడు. అయితే తండ్రి కొడుకుల మధ్య డబ్బుల వ్యవహారమే ఈ ఘటనకు కారణమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ అసెంబ్లీ హాల్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మాజీ మంత్రి హరీశ్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం భేటీ అయ్యారు. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలను స్పీకర్‌కు వివరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కేటీఆర్, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మాణిక్యరావు ఉన్నారు.
ప్రైవేటు కొరియర్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ.40వేలు మాయమైన ఘటన అమీన్‌పూర్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయిభగవాన్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆదివారం DTDC అనే కొరియర్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేశాడు. లింకు పంపుతున్నాను దానిలో రూ.5వేలు పంపండి కొరియర్ చేరుతుందని కస్టమర్ కేర్ ఉద్యోగి చెప్పగా డబ్బులు పంపాడు. వెంటనే ఖాతాలోని రూ.40వేలు డ్రా అయ్యాయి.
నాగల్‌గిద్ద మండలంలోని రేఖానాయక్ తండా, చోక్లా తండా, శాంతినగర్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక్కడి టీచర్లు ఇటీవల జరిగిన బదిలీల్లో మరో చోటుకి వెళ్లారు. ఈ పాఠశాలలు దూర ప్రాంతంలో ఉండడంతో ఇక్కడికి రావడానికి టీచర్లు సుముకత చూపట్లేదు. దీంతో పిల్లలకు తమ వెంట పనులకు తీసుకెళ్లగా, మరికొందరు ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి స్కూళ్లు తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ ఏరియా దవాఖాన, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లి పీహెచ్‌సీల్లో రోగులు బారులుతీరుతున్నారు. జూన్‌లో కౌడిపల్లి పీహెచ్సీలో 148 మంది జ్వరంతో బాధపడుతున్న వారికి చికిత్సలు చేయగా, జూలైలో 57 మంది టైఫాయిడ్ బాధితులకు వైద్యం అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు కాంగ్రెస్ తీపికబురు చెప్పింది. ఆగస్టు 15 లోగా రూ. 2లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఈమేరకు మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా నుంచి 2023-24లో 1,75,832 మంది రైతులకు రూ.1,299 కోట్ల మేరకు పంట రుణాలు పంపిణీ చేశారు. ఇందులో లక్ష మందికి పైగా రైతులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారు ఉంటారని సమాచారం.
నంగునూరు మండల కేంద్రానికి చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సూక్ష్మరాతి పనిముట్లను గుర్తించాడు.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పరిశోధనలు చేస్తున్న ఆయన కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డళ్ళు,శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలు,పూసలు,దేవత విగ్రహలు ఎన్నో గుర్తించాడు.ఇప్పుడు కొత్తగా గ్రామానికి దక్షిణం వైపున ఉన్న జోకిరమ్మ బండ మీద సూక్ష్మరాతి పరికరాలు (మైక్రోలిథిక్ టూల్స్) గుర్తించాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి కవిత తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్‌తో కూడిన ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 31వ తేదీ వరకు tsstudycircle. Co.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.