India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్-I ఏ.వి రంగనాథ్ సూచించారు. కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ అధికారులతో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులందరూ సమష్టిగా విధులు నిర్వహించాలన్నారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామ శివారులోని మహి గ్రానైట్ పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పరిశ్రమలో విధులు ముగించుకొని వెళ్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువకుడు అమిత్ కుమార్ సింగ్(32) అనే కార్మికుడిని బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు రూ.50 లక్షలు పట్టుకున్నట్లు తెలిపారు. గజ్వేల్ సీఐ సైదా, అడిషనల్ ముత్యంరాజు, సిబ్బంది ప్రత్యేక బలగాలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో పెద్ద మొత్తంలో నగదు లభించగా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
MHBD జిల్లాలో శుక్రవారం విషాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి సిద్దిపేట జిల్లా కక్కెర్లపాడు చెందిన లావణ్యతో పెళ్లి జరిదింది. కుటుంబ కలహాలతో తన కూతురు నిత్య(8), కుమారుడు ముఖేష్(10)లను బావిలో తోసి తానూ దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా.. బాలుడు ముఖేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భర్త వివాహేతర సంబంధమే మహిళ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి శివారులో మేకలను దొంగలించేందుకు ప్రయత్నించిన భీమ్ రావు, మధు అనే ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకున్నారు. డమ్మీ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిన ఇద్దరు యువకులు బైక్‌పై నుంచి కింద పడటంతో గాయాలయ్యాయి. దొంగలను ఆస్పత్రికి తరలించిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.5 లక్షల నగదును పోలీసు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం షెల్గిరా చెక్‌పోస్టు వద్ద జరిగింది. ఎన్నికల కోడ్ సందర్భంగా పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ కారులో రూ.5 లక్షల నగదును పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు చూపకపోవడంతో అధికారులు నగదును సీజ్ చేసినట్లు ఎస్సై అమ్రానాయక్ తెలిపారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో ఓ బాలిక వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. 15 ఏళ్ల వయసు గల బాలిక వివాహం గ్రామంలో జరుగుతుందన్న సమాచారం మేరకు ఐసీడీఎస్ సీడీపీఓ కరుణ శీల, సూపర్వైజర్ సంతోష, కొల్చారం పోలీసుల సహాయంతో గ్రామానికి చేరుకొని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. సదరు బాలికను మెదక్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.
సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ రీజియన్ కోఆర్డినేటర్ భీమయ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను https://WWW. TSWREIS.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దుబ్బాక పట్టణంలో రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు ఇరు వర్గాలుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. రేకులకుంట, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో బాధ్యులు, మరికొంత మందిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరణ ఇచ్చారు.
రానున్న ఏప్రిల్, మే నెలలో తాగునీటి సమస్య లేకుండా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.