India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెద్దశంకరంపేటలో మతిస్తిమితం లేని కుమారుడిని తండ్రి మద్యం మత్తులో రోకలితో కొట్టి చంపినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. పోలీసుల వివరాలు.. సాయిలు, భూమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. చిన్న కుమారుడు ప్రదీప్ (16) మానసిక వైకల్యంతో ఉన్నాడు. వైకల్యం భరించలేని తండ్రి మద్యం మత్తులో రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తాత పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఓటరు జాబితాల సవరణ, తదితర అంశాలపై అధికారుల దృష్టి సారించారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు, 14,336 వార్డులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు, 5,778 వార్డులు, మెదక్‌లో 469 జీపీలు, 4,082 వార్డులు, సిద్దిపేటలో 499 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఓటరు జాబితాల సవరణ, తదితర అంశాలపై అధికారుల దృష్టి సారించారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు, 14,336 వార్డులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు, 5,778 వార్డులు, మెదక్‌లో 469 జీపీలు, 4,082 వార్డులు, సిద్దిపేటలో 99 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఓటరు జాబితాల సవరణ, తదితర అంశాలపై అధికారుల దృష్టి సారించారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు, 14,336 వార్డులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు, 5,778 వార్డులు, మెదక్‌లో 469 జీపీలు, 4,082 వార్డులు, సిద్దిపేటలో 99 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హవేలిఘనపూర్ మండలంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ టౌన్ PSలో పనిచేస్తున్న కానిస్టేబుల్ బానోతు దుర్గపతి(50).. స్వగ్రామం ఫరీద్‌పూర్ తండా నుంచి విధులకు బైక్‌పై వెళ్తున్నారు. కూచంపల్లి సమీపంలో కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నిందితులకు శిక్షపడేలా కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది కృషి చేయాలని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. పలు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసిన సిబ్బందికి DGP నిన్న ప్రశంసా పత్రాలు అందజేశారు. SP మాట్లాడుతూ.. 2023లో హత్య కేసులో రామాయంపేట CI చంద్రశేఖర్, 2021లో మరో కేసులో తూప్రాన్ DSP కిరణ్ కుమార్.. నిందితులకు శిక్ష పడేలా చేశారు. నేర రహిత సమాజం కోసం నిందితులకు కోర్టులో శిక్ష పడేలా పనిచేయాలన్నారు.

ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన సంఘటన హత్నూర(M) తుర్కల ఖానాపూర్లో సోమవారం రాత్రి జరిగింది. పటాన్‌చెరు(M) పెద్దకంజర్లకు చెందిన బీ.మల్లేశం(45) కౌడిపల్లి(M) తిమ్మాపూర్లో బంధువు ఇంటికి దశదినకర్మ కార్యక్రమానికి ఆటోలో వెళ్లాడు. దౌల్తాబాద్ మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దౌల్తాబాద్లో యూసుఫ్ ఆటో ఎక్కాడు. తుర్కలఖానాపూర్ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడగా యూసుఫ్, మల్లేశం స్పాట్‌లో చనిపోయారు.

రైతు బీమా దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగియనున్నదని ఏవోలు తెలిపారు. ఇప్పటి వరకు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు ఆయా గ్రామాల్లో ఏఈవోలకు దరఖాస్తులను అందజేయాలని కోరారు. ఇప్పటికే ఒకసారి గడువు ముగిసిందని, రైతులకు బీమా కల్పించాలని వ్యవసాయశాఖ మరో అవకాశం కల్పించిందన్నారు.

ఉమ్మడి జిల్లాలో యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా వారిలో మార్పు లేదు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు గురై భార్యాపిల్లలు, తల్లిదండ్రులను అనాథలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 7నెలల్లో 1,77,395 కేసులు నమోదు, రూ.4.79కోట్ల జరిమానాలు వసూళ్లు చేయడం గమనార్హం. ఇందులో విత్‌ఔట్ హెల్మెట్ కేసులు అత్యధికంగా 57,381 ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డిఐఈఓ)గా రవీందర్ రెడ్డి నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో పలువురు ప్రిన్సిపాల్‌లను వివిధ కళాశాలలకు బదిలీ చేసింది. కరీంనగర్ బాలికల కళాశాల నుంచి కోహెడ కళాశాలకు బదిలీపై విచ్చేసిన సీనియర్ ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డిని నూతన డిఐఈఓగా నియమించారు. ఇక్కడ బాధ్యత నిర్వహించిన హిమబిందు బెజ్జంకి కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు.
Sorry, no posts matched your criteria.