India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హక్కులను పరిరక్షించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బృందానికి నరేగ సంఘర్షణ సమితి జాతీయ బృందం విన్నవించింది. సోమవారం డిల్లీలోని కృషిభవన్ లోని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆరుగురి అధికారులను ఆయా రాష్ట్రాలకు చెందిన దళిత, ప్రజా కార్మిక సంఘాల నాయకులు కలిశారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. జాబ్ కార్డుల తొలగింపు అన్యాయమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎంట్రీలను సమర్పించేందుకు ఈనెల 10 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారిని పరిచయం చేస్తూ వాటిని ఈనెల 15న ప్రదర్శిస్తామని వెల్లడించారు. వివరాలకు pr-tsic@telangana.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.

సత్వర్ డాబా వద్ద ఓ ట్రావెల్ బస్సులో జరిగిన చోరీలో రూ.3.10 కోట్ల విలువ చేసే 3 కిలోల బంగారం రికవరీ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని దార్వాడ పూర్‌కు చెందిన ముస్తాక్(40)ని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.

మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలలో సరైన సౌకర్యాలు లేవని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులకు నిరాకరించింది. దీంతో మెదక్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.180 కోట్ల నిధులు, 14 ఎకరాల భూమిని కేటాయించింది. సరైన సౌకర్యాలు లేవన్న కారణంతో ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరించగా, ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.

సిద్దిపేట(D) దుబ్బాక(M) పెద్దగుండవెళ్లికి చెందిన ఎల్లవ్వ(80) 2013 ఫిబ్రవరి 1న ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. పోలీసులు ఎల్లవ్వది హత్యగా భావించి ఆమె కొడుకు పోశయ్యను అరెస్టు చేశారు. 2015లో సిద్దిపేట కోర్టు పొశయ్యకు యావజ్జీవ శిక్ష విధించగా, పోశయ్య హైకోర్టును ఆశ్రయించారు. జైలులో శిక్ష అనుభవిస్తూ ఆగస్టు 14, 2018లో మృతిచెందారు. ఆధారాలు లేవని కొట్టివేయగా పోశయ్య నిర్దోషిగా తేలాడు.

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, డైరెక్టర్ల పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. యాదవ సామాజిక వర్గం ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలి ఛైర్మన్ పదవిని అదే సామాజిక వర్గానికి కేటాయించాలని దేవాలయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రస్తావించారు. ఛైర్మన్ పదవికి 8 మండలాల నుంచి 22 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం చిత్తరి బేతయ్యను గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వర్గల్ మండల కేంద్రంలోని శంభుగిరి కొండలపై రంగు అక్షరాల్లో శాసనం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీ రామోజీ హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు దీనిని గుర్తించారు. ఈ శాసనం లిఖించిన గుహను దేవాలయ సిబ్బంది స్టోర్ రూం తరహాలో వినియోగిస్తున్నారు. శాసనంలోని చాలా భాగం చెదిరి కొన్ని పదాలు మాత్రమే మిగిలాయని హరగోపాల్ తెలిపారు. అక్షరాలు వరగంటి, స్వస్తిశ్రీ, మల్ల, కల్గిని కనిపిస్తున్నాయి.

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈనెల 8 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో చదువుకోవచ్చని పేర్కొన్నారు. పదవ తరగతి చదివిన వారు ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా మెదక్ రీజియన్‌లో ప్రతిరోజు లక్ష 70 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని మెదక్ ఆర్ఎం ప్రభులత తెలిపారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన 9 డిసెంబర్ 2023 నుంచి నేటి వరకు సుమారుగా ఉచిత ప్రయాణాన్ని 3.80 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని, ఈ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో 70%గా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో నేడు 98%కి పెరిగిందన్నారు.
Sorry, no posts matched your criteria.