India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నార్సింగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయడం లేదు. దీంతో అతని భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో విరక్తి చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసు, ఇతర శాఖలు సమన్వయంగా తనిఖీలు చేస్తున్నాయి. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. రూ.50 వేలకు మించితే నగదు సీజ్ చేస్తున్నారు. ఎన్నికలకు అనుబంధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్సు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇతరత్రా బృందాలు సోదాలు చేస్తున్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో జాజి తండా గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కూలిపోయి సంగీత(3)కు గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీరయ్య అనే వ్యక్తి మరికొందరితో కలిసి మైసమ్మ కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 3 తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగసభలకు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్లలో అనుమతులు తీసుకోవాలని సూచించారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ అనుమతులను సువిధ యాప్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.
సిగరెట్ కోసం ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం బిహార్‌కు చెందిన అంకిత్, రోషన్ గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. సిగరెట్ కోసం రోషన్ అంకిత్ మధ్య గొడవ జరిగింది. దీంతో రోషన్(21)ను భవనం పైనుంచి కిందకు తోశారని వెల్లడించారు. తీవ్ర గాయాలైన రోషన్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారన్నారు.
సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు వచ్చినట్టు వివరించారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలన్నారు. కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.
ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేలాది మంది తరలిరాగా సోమవారం కూడా భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసిపోయారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో BRS జెండా ఎగరేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈసారి గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నట్లు శ్రేణులు చెబుతున్నాయి. మరి హరీశ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూడాలి.
Sorry, no posts matched your criteria.