India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బాలగౌని శేఖర్ గౌడ్ (25) శనివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శేఖర్ గౌడ్ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అయితే అతడికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.
10వ తరగతి పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కష్టపడి చదివిన అంశాలను రాయాలని ఉత్తమ ఫలితాలతో ముందంజలో నిలవాలన్నారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఏకాగ్రతతో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. చదువును కష్టపడి కాకుండా ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో తొమ్మిదో ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జానపదుల జాతరకు పెట్టింది పేరు కొమురవెల్లి మల్లన్న జాతర కాగా పట్నాలు, బోనాలు, డోలు చప్పుళ్లు, ఢమరుక నాదాలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతరలో భక్తులను ఆకట్టుకున్నాయి.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన మర్రి స్వామి(45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో అతడు అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోతుండే వాడని, అలాగే ఈనెల 11న భార్య జ్యోతితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడన్నారు. ఈ క్రమంలో ఘనపూర్ గ్రామ శివారులో ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆదివారం రాత్రి స్థానికులు గుర్తించారన్నారు. మృతదేహం కుళ్లిపోయిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రూప్-2, గ్రూప్-3, డీఎస్సీ, టెట్, హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్లు రావడంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు సుమారు 7లక్షల మంది ఉన్నట్లు సమాచారం.
పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో 269 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 46,356 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
కొల్చారం మం. కిష్టాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వస్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కంగ్టి మండలం భీమ్రాలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన శిరుగొండ (45) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ‘పొలం పనుల్లో ఉండగా వర్షం పడింది. రేకుల షెడ్డు కింద తలదాచుకోగా ఒక్కసారిగా పిడుగు పడింది’ అని స్థానికులు PSకు సమాచారం ఇచ్చారు. కంగ్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండముల కిరణ్ (23) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.