India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కుల గ్రామ శివారులోని కమ్మరివారి కుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరువు సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు ఎలా చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది. మృతుడి ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోలీసులు సూచించారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల నాటి(పూర్వ) విద్యార్థులే నేడు టీచర్లు అయ్యారు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మది మందికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలి పదోన్నతులు, బదిలీల్లో వీరంతా జోగిపేటకు వచ్చారు. చిన్నప్పుడు చదువుకున్న బడిలోనే ఇప్పుడు పాఠాలు నేర్పే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి ఓ రోజు వస్తదని ఉహించలేదని టీచర్లు మాణయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్(PD), రమేశ్ కుమార్ అన్నారు.
వివాదాస్పద ఐలాపూర్ భూముల్లో మళ్లీ కబ్జాదారుల కదలికలు ప్రారంభమయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజవర్గం అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో కోర్టు వివాదంలో నలుగుతున్న భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలు సర్వే నంబర్లలో నాట్ టు ఎంటర్ ఫియర్ పేరుతో కోర్టు డిగ్రీని చూపిస్తూ భూములను చదును చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్-మానక్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీంట్లో భాగంగా ఏటా దేశవ్యాప్తంగా 5 లక్షల పాఠశాలలను ఎంపిక చేసి ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. 2024-25 సంవత్సరానికి ప్రతిపాదనలను సెప్టెంబర్ 15లోగా వెబ్సైట్ పంపించాల్సి ఉంది.
వాట్సాప్లో PM కిసాన్ పేరుతో వచ్చిన లింక్ కలకలం సృష్టిస్తోంది. హుస్నాబాద్ ఉపాధి హామీ APOపద్మ వాట్సాప్లో నుంచి PM కిసాన్ 1.0 ENAPK పేరుతో గ్రూపుల్లో పోస్టు వచ్చింది. కొందరు వెంటనే APOకు కాల్ చేయగా తన ఫోన్ హ్యాక్ అయిందని, లింక్ క్లిక్ చేయొద్దని చెప్పారు. 2రోజుల క్రితం వాట్సాప్కు వచ్చిన ఈ లింక్ ఓపెన్ చేయగా ఫోన్ హ్యాక్ చేశారు. తనకు తెలియకుండానే గ్రూప్, నంబర్లకు లింక్ వెళ్తుందన్నారు.
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 8న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి పరిష్కరిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో వన మహోత్సవ లక్ష్యసాధనకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 35.88 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని దొంగిలించి అందులో ఉన్న నగదు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో జరిగింది. 161 జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ దేవాలయంలో పలుమార్లు దొంగతనాలు జరుగుతున్నాయి. 3సార్లు దొంగతనాలు జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.
క్షణికావేశంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు మందలిచండంతో రాయపోల్ మండలం ఎల్కల్కు చెందిన రాజు(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన జాల యాదయ్య(56) చేసిన అప్పులు తీరక సూసైడ్ చేసుకోగా.. అక్కన్నపేటకు చెందిన తంగళ్లపల్లి సాగర్(23)వ్యక్తిగత కారణాలతో ఉరేసుకున్నాడు.
HYD జగద్గిరిగుట్ట PS పరిధిలో <<13530512>>అనిల్ అనే వ్యక్తి<<>> హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ DCP సురేశ్ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. మెదక్ జల్లా అల్లాదుర్గం వాసి అనిల్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్నాడు. దీంతో భార్య భాగ్యలక్ష్మీ భర్తను హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.