India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నోట్ల కట్టలతో మన ముందుకు వస్తోందని, మాజీ మంత్రి హరీశ్‌రావు నంగనాచి మాటలను ప్రజలు నమ్మొద్దని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. రామాయంపేటలో ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించారు. నామ్‌కేవాస్తేగా అసెంబ్లీ ఎన్నికల ముందు రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇప్పటికీ సిబ్బంది నియామకం లేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మోసాలనే ప్రచార హస్త్రాలుగా వాడుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ను ఎండగట్టారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎల్ఈడీ స్కిన్ పై పార్టీ శ్రేణులకు చూపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై నిలదీయాలన్నారు.
కౌడిపల్లిలో జరిగిన కౌడిపల్లి, చిలిపిచెడ్, కుల్చారం మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. మెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా అని, ఎవరు అడ్డొచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఐనవోలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మహేశ్, శ్రీనుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచార సమరానికి సమాయత్తమవుతున్నారు. మెదక్ సెగ్మెంట్‌లో BRS నుంచి MLC వెంకట్రామ్‌రెడ్డి, మాజీ MLA రఘునందన్ రావు (BJP), నీలం మధు (కాంగ్రెస్) బరిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను రాబట్టుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. ఈనెల 18 తర్వాత ప్రచారం హోరెత్తనుంది .
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డిఎస్ఓ బ్రహ్మారావు, ఫ్యాక్స్ సీఈవో సాయి తదితరులున్నారు.
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి చెందిన ఘటనా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన చందన కోహిర్‌లో ఇంటర్ చదువుతోంది. ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా ఇంటికి ఆనుకొని ఉన్న కరెంటు తీగలు చేతికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమం పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు.
మెదక్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి రుద్రారంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాల పొంగు లాగా ఉందన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో, అంతే వేగంగా పడిపోయిందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.
సిద్దిపేట జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.5,79,640 సీజ్ చేసినట్లు సిద్దిపేట సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. వంటిమామిడి చెక్ పోస్టు వద్ద రూ.1,50,000, గౌరారం పోలీస్ స్టేషన్ ఎదురుగా రూ.76,640, ముస్త్యాల చెక్ పోస్టు వద్ద రూ.1,60,000, రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ వద్ద రూ.1,10,000, హబ్సిపూర్ X రోడ్ వద్ద రూ. 83,000 సీజ్ చేసినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.