Medak

News April 12, 2024

ఒక్క రూపాయి అద్దెకే ఫంక్షన్ హాల్: వెంకట్రామిరెడ్డి

image

నియోజకవర్గ కేంద్రాల్లో నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడేలా ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తామని మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. RCపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రాల్లో సామాజిక భవనాలు నిర్మించి ఒక్క రూపాయి అద్దెకు ఇస్తామన్నారు. రూ.100 కోట్ల నిధులతో ఉచిత విద్యతోపాటు, నీట్, IAS, IPS కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

News April 12, 2024

గజ్వేల్: మరోసారి తెరపైకి RRR అలైన్మెంట్ మార్పు అంశం

image

రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. మర్కూక్ మండల రైతులు మంత్రి వెంకట్ రెడ్డిని కలవడంతో మరోసారి అలైన్మెంట్ మార్పు అంశం తెరపైకి వచ్చింది. HYD రింగ్ రోడ్డుకు 30KMలోపు RRR ఖరారు చేయడంతో నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరోసారి మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు సేకరిస్తున్నారు.

News April 12, 2024

మెదక్: ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’

image

కాంగ్రెస్‌ పాలనతో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకోవాలని, ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ నినాదాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఈటల ఉద్ఘాటించారు. మెదక్‌ చిల్డ్రన్‌ పార్కులో పోలింగ్‌ బూత్‌ కేంద్రాల అధ్యక్షులు సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రసంగించారు.

News April 12, 2024

సిద్దిపేట: కాంగ్రెస్ అభ్యర్థులను చీపుర్లతో కొట్టి తరిమేయండి: హరీష్ రావు

image

ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను చీపుర్లతో కొట్టి తరిమేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గురువారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నెలలు గడుస్తున్న ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని విమర్శించారు. ఆరూ గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఎక్కడ అమలు చేశారో చూపించాలని ఆయన సవాల్ విసిరారు.

News April 11, 2024

మెదక్: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి

image

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ టేక్మాల్ మండలం దన్నూరా, బర్దిపూర్, పాల్వంచ, కూసంగి, మల్కాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దుబ్బగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News April 11, 2024

సిద్దిపేట: బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తాం: మైనంపల్లి

image

బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేటలో గురువారం జరిగిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణతో కలిసి సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్, కౌన్సిలర్ రియాజుద్దిన్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి భారీ మెజారిటీ వచ్చేలా నాయకులు పనిచేయాలన్నారు.

News April 11, 2024

మెదక్‌ MP స్థానంపై మైనంపల్లి ఫోకస్!

image

మెదక్‌ MP స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మైనంపల్లి హన్మంతరావు, MLA రోహిత్‌ కీలక నేతలను హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బుధవారం BRS కౌన్సిలర్లు రోహిత్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రామాయంపేటలోని నలుగురు కౌన్సిలర్లు‌ కాంగ్రెస్‌లో చేరగా.. తూప్రాన్‌ మున్సిపాలిటీలోనూ హస్తం పాగా వేసింది. లోక్‌సభ అంతటా పార్టీ బలోపేతం కోసం మైనంపల్లి‌ ప్రత్యేక చొవర తీసుకొంటున్నట్లు టాక్.

News April 11, 2024

మెదక్ ఖిలాను సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

మెదక్ ఖిల్లాను కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఖిలా చరిత్రను ప్రముఖ వ్యాఖ్యాత వైద్య శ్రీనివాస్ వివరించారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన మెదక్ దుర్గం ప్రాముఖ్యత తెలిపారు. ఈ ఖిలా మెదక్‌కు తలమానికం అన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ఖిల్లాను కుటుంబసభ్యులతో కలిసి తిరిగారు. అంతకు ముందు ఏడుపాయల వనదుర్గ మాతను కలెక్టర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

News April 11, 2024

పాపన్నపేట: అప్పుల బాధతో ఆత్మహత్య

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబిది యేసు(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధతో మనస్థాపానికి గురైన యేసు రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట పోలీసులు కుర్తివాడకు చేరుకొని విచారణ చేస్తున్నారు.

News April 11, 2024

సదాశివపేట: క్రీడా ప్రాంగణంలో గుడిసెలు !

image

సదాశివపేట మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్వహణ అధ్వానంగా మారింది. బోర్డులు పాతిన మున్సిపల్ అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడంతో కొందరు కబ్జా చేస్తున్నారు. పట్టణంలోని ఓ క్రీడా ప్రాంగణంలో కొందరు గుడిసెలు వేసుకొని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలు కబ్జాకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు.