India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మెదక్ లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఎన్నిక ఖర్చు కూడా అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, మెదక్ ఎన్నికలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.
కంగ్టి మండలం చాప్టా(కే) శివారులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు కంగ్టి CI చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు ముర్కుంజాల్‌కు చెందిన వడ్డే సంజుగా గుర్తించారు. శరీరంపై ఉన్న గాయల ప్రకారం దారుణంగా హత్యకు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లో గొడవతో భార్య 2నెలల క్రితం పుట్టింటింటికి వెళ్లింది. సంజు తల్లిదండ్రులు చనిపోగా సోదరులు HYD వలస వెళ్లారు.
మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, 44 మంది పోటీలో ఉండడంతో మూడు ఈవీఎంలో అవసరము కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.
పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కాగా మెదక్ జిల్లాలో 10,389, సంగారెడ్డి జిల్లాలో 22,069, సిద్దిపేట జిల్లాలో 13,987 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
మెదక్ జిల్లాలో నేడు జరగనున్న ఎన్నికల ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మధ్యలో ఉన్న అల్లాదుర్గంలో నేడు నిర్వహించనున్న బీజేపీ ‘విశాల్ జనసభ’లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం ఐబీ చౌరస్తా వద్ద 30 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ప్రధాని, ఇతర ముఖ్య నేతల కోసం భారీ వేదిక ఏర్పాటు చేశారు.
మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల సమాచారం.. హైవేపై ద్విచక్ర వాహనం మీద దంపతులు ఇద్దరు వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామస్థులుగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ లోక్ సభ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్లు వేయగా స్ర్కూటీనిలో ఒకటి రిజెక్ట్ అయింది. సోమవారం వరకు 9 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గుర్తింపు పొందిన BRS, కాంగ్రెస్, BRS, బీఎస్పీ నుంచి నలుగురితోపాటు 11 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మెదక్‌లో ముక్కోణపు పోటీ జరగనుంది. అటు <<13147815>>జహీరాబాద్ బరిలో<<>> 19 మంది నిలిచారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. సిద్దిపేట 44.3, సదాశివపేట 43.6, కొండాపూర్ 43.5, నిజాంపేట 43.4, తుక్కాపూర్ 43.2, దూల్మిట్ట, వట్ పల్లి లలో 43.1, చేగుంట, కౌడిపల్లి, శనిగరం లలో 42.9, బెజ్జంకి 42.8, బీహెచ్ఈఎల్ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
జహీరాబాద్ ఎంపీ బరిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది నిలిచారు. ఇక్కడ మొత్తం 44 మంది నామినేషన్ దాఖలు చేయగా.. 18 నామినేషన్లు తిరస్కరించారు. సోమవారం వరకు 7 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. రికగ్నైజ్డ్ జాతీయ, రాష్ట్ర పార్టీల తరఫున ముగ్గురు, రిజిస్టర్డ్ పార్టీల తరఫున ఆరుగురు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది.
MP ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్, BJP.. హరీశ్ రావు, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో BRSకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో దాన్ని తమ పార్టీలవైపు మలుపుకోవాలని చూస్తున్నాయి. దీంతో తమ అభ్యర్థుల గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆయా పార్టీల నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.