Medak

News April 10, 2024

మర్కూక్: రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి కోమటిరెడ్డి

image

రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్గొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్కూక్ మండలం చేబర్తి, నర్సన్నపేట గ్రామాల రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని, సీఎం దృష్టికి మీ సమస్య తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

News April 9, 2024

తూప్రాన్: రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి మృతి

image

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ నరసింహారెడ్డి (48) మృతి చెందాడు. యావపూర్‌కు చెందిన సురేందర్ రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహారెడ్డి ద్విచక్ర వాహనంపై 4న వెళ్తున్నాడు. యావపూర్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News April 9, 2024

మెదక్: శ్రీరామనవమి వేడుకలకు రఘునందన్ రావు‌కు ఆహ్వానం

image

రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలకు బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 17న నిర్వహించనున్న శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు రఘునందన్ రావు‌ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News April 9, 2024

మెదక్: అయ్యప్ప ఆలయంలో పంచాంగ పఠనం

image

మెదక్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ క్రోధి నామ ఉగాది సందర్బంగా మంగళవారం సాయంత్రం పంచాంగ పఠనం చేశారు. అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు వైద్య రాజు పంతులు పంచాంగ పఠనం గావించారు. ఈ సందర్బంగా ద్వాదశ రాశులకు సంబంధించి గోదారా ఫలాలు, తెలుగు సంవత్సరంలో రాజు, మంత్రి, పశు పాలకుడు తదితర వివరాలు వినిపించారు. అలాగే ఆదాయం, ఖర్చు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది అని తెలిపారు.

News April 9, 2024

MDK: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి: జగ్గారెడ్డి

image

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని పంచాంగంలో పండితుడు తెలిపినట్లు ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాని జగ్గారెడ్డి అన్నారు.

News April 9, 2024

MDK: పండగ పూట విషాదం

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి శివారులో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన ఎరుకల మహేశ్(21) ఉగాది పండగ నేపథ్యంలో మామిడి ఆకుల కోసం పల్సర్ బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న మరో బైక్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో మహేశ్‌ కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు.

News April 9, 2024

MDK: 106 మంది ఉద్యోగులు సస్పెండ్

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అధికారులపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశంలో పాల్గొన్న వారిని సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన అధికారులు 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులను ఎన్నికల నిబంధన మేరకు వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 9, 2024

ఆకుపై చిత్రాలతో ఉగాది శుభాకాంక్షలు

image

నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకు మార్ తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా మర్రి ఆకులపై మామిడి కాయ, కోయిల చిత్రాలను మలిచారు. ఈరోజు ఉగాది పచ్చడికి వినియోగించే మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, చెరకు గడలు, ఆహ్లాదకర వాతావరణం, పచ్చని చెట్లు, కోయిలలు, చిలకలు, ఉగాది పచ్చడితో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళ చిత్రాలను గీసి క్రోధి నామ సంవత్సరానికి ఆయన స్వాగతం పలికారు.

News April 9, 2024

MDK: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ వాసి కృష్ణ(33) అమీన్‌పూర్ పురపాలక పరిధి మల్లారెడ్డి కాలనీలోని గెరడా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా 10 రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2024

సిద్దపేట: చిరుతను కొట్టి చంపి.. తగలబెట్టి..

image

చిరుతను కొట్టి చంపి తగలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. FRO సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దపేట జిల్లా దౌల్తాబాద్ అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితం సాయిలు, మరో ముగ్గురు కలిసి అడవి పందుల కోసం వల పెట్టగా.. అందులో చిరుత చిక్కింది. భయాందోళనకు గురైన వారు చిరుతను కర్రలతో కొట్టి చంపి ఆనవాళ్లు లేకుండా కళేబరాన్ని తగులబెట్టారు. పోలీసులు సాయిలును అదుపులోకి తీసుకొని విచరణ చేపట్టారు.