India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య (50) హౌసింగ్, ట్రాక్టర్ లోన్ తీర్చలేక శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి నిమ్స్ కి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని కుమారుడు హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణా రెడ్డి తెలిపారు.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలు అధికంగా ఉన్నారు. ఈ జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 16,04,947 మంది ఓటర్లు ఉండగా, ఐదేళ్లల్లో 2.23 లక్షల మంది ఓటర్లు పెరగడం గమనార్హం.
మెదక్‌లో బీజేపీ మాకు పోటీయే కాదని కాంగ్రెస్ MP అభ్యర్థి నీలం మధు అన్నారు. శనివారం దుబ్బాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం మధు మాట్లాడుతూ.. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాక చేసింది ఏమీలేదని విమర్శించారు. ఆయన మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు.
క్రికెట్ బెట్టింగ్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. బీటెక్ విద్యార్థి వినీత్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఏకంగా రూ. 25 లక్షలు లోన్ తీసుకొని క్రికెట్ బెట్టింగ్ పెట్టి పోగొట్టుకొన్నాడు. తిరిగి ఆ డబ్బులు చెల్లించలేక మనస్తాపానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు అయోధ్యకి వెళ్లడంతో ఇంట్లో ఎవరులేని సమయంలో శనివారం సదాశివపేటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
అధికారం లేదని KCR, KTR – ఫ్రస్ట్రేషన్ ఉన్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. BRS ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. KCR, KTR బస్సు ఎక్కి మహిళతో మాట్లాడితే.. ఉచిత బస్సు ఎలా అమలవుతుందో తెలుస్తుందని అన్నారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి మెదక్ పార్లమెంట్ స్థానంపై ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ సీఎం KCR వంటి కాకలుతీరిన నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు గట్టి అభ్యర్థులను బరిలో దింపగా, వారు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. 2001 ఏప్రిల్‌లో హైదరాబాద్ జలా దృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్తానం నేడు దేశానికి ఆదర్శం అయిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటమి గెలుపులు కొత్త కాదని అన్నారు. పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి సత్తా చాటాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా త్రిముఖ పోరు రాజకీయం కొనసాగుతుంది. BRS, కాంగ్రెస్, BJP నుండి పోటీ చేస్తున్న నాయకులకు మెదక్‌తో అనుబంధం ఉండడంతో రాజకీయం వేడెక్కింది. హైట్రిక్ సాధించాలని BRS ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా గెలుపు తనదేనని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అంటున్నారు. బీసీ బిడ్డను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ప్రచారం చేస్తున్నారు.
మెదక్ లోక్ సభ స్థానానికి దాఖలైన 54 మంది అభ్యర్థుల నామినేషన్ల లలో 53 మంది నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థి కళ్ళు నరసింహ గౌడ్ నామినేషన్ తిరస్కరించారు. నామినేషన్ ఆమోదం పొందిన 53 మందిలో 18 మంది ఆయా పార్టీలకు చెందిన వారున్నారు. స్వతంత్ర అభ్యర్థులు 35 మంది ఉన్నారని రాహుల్ రాజ్ తెలిపారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ శివారులోని ప్రసాద్ హోమ్స్ వెంచర్‌లో గుర్తుతెలియని యువకుడి కుళ్ళిన శవం లభించినట్లు మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. కుళ్లిపోయిన యువకుడిని బిచ్చగాడుగా అనుమానిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. సుమారు 35 ఏళ్ల వయసు కలిగి, ఎర్రని టీ షర్టు, నల్ల కలరు ప్యాంటు ధరించి బెల్టు ఉన్నట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.