Medak

News April 8, 2024

జహీరాబాద్: గెలుపే లక్ష్యంగా వ్యూహాలు !

image

ZHB లోక్‌సభ స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారికి ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ, ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ముందుకెళ్తుంది. మోదీతోపాటు పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభలకు BJP ప్లాన్ చేస్తుంది. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ పోరుకు BRS సన్నద్ధమవుతోంది.

News April 7, 2024

MDK: KCR, హరీశ్‌రావుపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు 

image

మామ, అల్లుడిని ఇంటికి పంపే వరకు నిద్రపోనని మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు KCR, హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. గజ్వేల్‌లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటపై ఫోకస్ చేశానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలో దిగుతానని, గజ్వేల్‌లో నర్సారెడ్డి కూతురిని MLAని చేస్తానన్నారు. KCR, హరీశ్‌రావును వదిలిపెట్టనన్నారు. 

News April 7, 2024

మెదక్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలి

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపుకు సమిష్టిగా కృషి చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మతోధు కలిసి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, కౌన్సిలర్ రవీందర్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు ఉమర్, సమీర్ ఉన్నారు.

News April 7, 2024

సంగారెడ్డి: ఇఫ్తార్ విందులో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ

image

జహీరాబాద్ పట్టణంలో మహ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణీక్ రావు, BRSఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ వేళలో ముస్లింలతో పాటు వీరంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండ్లు, ఫలాలు, విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News April 7, 2024

నర్సాపూర్: బోర్‌వెల్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ ముందు అతివేగంగా వచ్చిన బోర్‌వెల్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2024

మెదక్: రేషన్ బియ్యం పట్టివేత

image

రామయంపేట 44వ జాతీయ రహదారిపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సమాచారంతో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి గుజరాత్ వెళ్తున్న ఒక లారీలో 304 క్వింటాల్ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. లారీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News April 7, 2024

MDK: కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోతోంది: MLC

image

9 ఏళ్లుగా పోని కరెంట్.. నేడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు పోతోందని BRS మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, MLC వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్ధన్నపేటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోతోందని, చెరువులు ఎండిపోయి.. కరవు వచ్చిందన్నారు. మళ్లీ KCR పాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

News April 7, 2024

MDK: రాహుల్ గాంధీ ఎప్పటికీ PM కాలేరు: MLA

image

దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీస్తుందని, మూడోసారి ఆయనే ప్రధాని కావడం ఖాయమని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే, ఆ పార్టీ జహీరాబాద్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జహీరాబాద్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని విమర్శించారు. బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. దీనిపై మీ కామెంట్?

News April 7, 2024

సంగారెడ్డి: పెరుగుతున్న కోతుల బెడద

image

జిన్నారం మండల పరిధిలోని మాదారం, కొడకంచి, శివనగర్, ఊట్ల, రాళ్లకత్వ, గడ్డపోతారం, వావిలాల తదితర గ్రామాలలో రోజురోజుకీ కోతుల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా కోతుల గుంపు రోడ్లపై తిష్ట వేసి వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తున్నాయి. కోతులు ఇళ్లల్లోకి చొరబడి చాలా మందిపై కోతులు దాడులు చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ పాలకులు సమస్యను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు.

News April 7, 2024

సంగారెడ్డి: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజల్పూర్ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. 50-60 మధ్య వయస్సు గల మహిళగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో మతి స్థిమితం కోల్పోయి తిరుగుతుండగా స్థానికులు చూసినట్లు తెలిపారు. వివరాలు ఎవరికైనా తెలిస్తే ఖేడ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి చెప్పారు.