India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో మెదక్ జిల్లాలో 3,518 మంది విద్యార్థులకు 1,804(51.28), సంగారెడ్డిలో 9,358కి 5,456(58.03), సిద్దిపేటలో 4,622కి 2,649(57.31) పాసయ్యారు. అటూ సెకండియర్ ఫలితాల్లో మెదక్ జిల్లాలో 2,186 మందికి 1,151 మంది(52.65), సంగారెడ్డిలో 5,213కి 2,277(43.68), సిద్దిపేటలో 2,967కి 1,438(48.47) ఉత్తీర్ణత సాధించారు.
మద్యం తాగే క్రమంలో స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేకున్నాడు. ఈ ఘటన చేగుంట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చేగుంటకు చెందిన తిరుపతి, సాయికుమార్(21) ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ స్నేహితుడిపై దాడి చేశాడు. ఆ క్రమంలో స్నేహితుడు గాయడగా భయపడిన సాయికుమార్ స్థానిక ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేకున్నాడు. మృతుడి తలిదండ్రులు గతంలోనే మృతి చెందారు.
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన వర్గల్ మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(17) బంగ్లావెంకటాపూర్ గ్రామానికి చెందిన స్వామిని ప్రేమించింది. శనివారం పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతడు నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
గుండెపోటుతో రైతు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటన చిన్న శంకరంపేట్ మండలం రుద్రారంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగోల్ల నర్సింలు (50) వ్యవసాయ పనులు చేయడానికి సిద్ధం అవుతుండగా.. గుండె పోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్దామనేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్‌లో ఆదివారం ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమయ్యింది. తొలి రోజు స్లాట్ నమోదు చేసుకున్న 274 మంది విద్యార్థులకు గాను 258 మంది హాజరయ్యారని ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణలత తెలిపారు. ఈ నెల 25 తేది వరకు పరిశీలన జరిగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న 38 మంది ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. తెలుగు మీడియంలో 35, ఉర్దూ మీడియంలో ఒకరు, ఇంగ్లీష్ మీడియంలో ఇద్దరికీ పదోన్నతి కల్పించినట్లు చెప్పారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఈనెల 24న వారికి కేటాయించిన పాఠశాలలు చేరాలని సూచించారు.
‘ఫసల్’ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశం సంగారెడ్డిలో మే 23న జరిగింది. ప్రీమియం భారం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. గ్రామ యూనిట్‌గా వరి, మొక్కజొన్న, మండలం యూనిట్‌గా పత్తిని గుర్తించారు. రైతుల అభిప్రాయం తీసుకున్న కలెక్టర్లు తర్వలో మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో సుమారుగా 14 లక్షల ఎకరాల్లో పంట సాగు కానుంది.
టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.1.05 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. పటాన్‌చెరు పోలీసులు తెలిపిన వివరాలు.. గోకుల్‌నగర్ చెందిన ఓ వ్యక్తికి జూన్ 14న టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామంటూ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అతను వివరాలు నమోదు చేసి దఫదఫాలుగా రూ.1.05 లక్షలు జమ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి స్పందించలేదు. మోసపోయానని బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
‘ఫసల్’ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశం సంగారెడ్డిలో మే 23న జరిగింది. ప్రీమియం భారం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. గ్రామ యూనిట్‌గా వరి, మొక్కజొన్న, మండలం యూనిట్‌గా పత్తిని గుర్తించారు. రైతుల అభిప్రాయం తీసుకున్న కలెక్టర్లు తర్వలో మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో సుమారుగా 14 లక్షల ఎకరాల్లో పంట సాగు కానుంది.
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్స్ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కల్పించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.