India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో రేపు బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని వివరించారు. ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం పేర్కొన్నాయి. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించాలని సందర్భంగా కోరాయి.
రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెదక్ పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన గొడవలకు, అనంతరం జరిగిన ధ్వంసం కేసులో ఇరువర్గాలలో 45 మందిని గుర్తించినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు ఊరుకోరని హెచ్చరించారు. సామాన్య ప్రజలు ఎవరిపైన కేసులు పెట్టే ఉద్దేశం లేదన్నారు. రెచ్చగొట్టే వారిని ఉపేక్షించమన్నారు.
మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాతోంది. స్వచ్ఛందంగా వర్తక, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. నిన్న రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగగా.. దానికి నిరసనగా బీజేపీ నాయకులు మెదక్ పట్టణ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్‌లో భారీగా పోలీసులు మోహరించారు.
జేసీబీ తవ్వకాల్లో బంగారం దొరికిందని మోసంతో రూ. 13 లక్షల తీసుకొని నకిలీ బంగారం అప్పగించిన ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం శివారు పాలెం గ్రామానికి చెందిన ఎం.ఆదెప్ప (32)ను అరెస్టు చేసినట్లు గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపారు. జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బలిజ గూడెం స్వామి మోసం చేశారు. వారి వద్ద నుంచి ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు
HYD ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) పొడవు పెరిగింది. ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పెంచాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా తాజా ఎలైన్‌మెంట్‌తో RRR ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 10.28 కి.మీ. పెరిగింది. దీంతో రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. అయితే గతంలో 340.51 కి.మీ. నిర్ణయించగా ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానం కోసం ఈ మార్పు అవసరమైందని అధికారులు తెలిపారు. ఈ మేరకు భూ సేకరణ చేయనున్నారు.
సంగారెడ్డి ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు పట్లోళ్ల అశ్విని రేపటి నుంచి 19 వరకు చైనాలో జరిగే 10వ ఏషియన్ పసిఫిక్ ఎక్సర్ సైజ్ స్పోర్ట్స్ సైన్స్ – 2024 సదస్సుకు ఎంపికయ్యారు. చైనాలో జరిగే సదస్సుకు 46 దేశాల ప్రతినిధులు పాల్గొంటుండగా.. ఈ సదస్సుకు భారత్ నుంచి ఫిజికల్ విభాగంలో అశ్విని ఒక్కరే ఎంపికయ్యారు.
ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు శుక్రవారం నీట మునిగి మృతి చెందాడు. నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడని పాపన్నపేట SI నరేశ్ తెలిపారు. HYDకి చెందిన ఎస్లీ వినోద్(48) స్థానికంగా వంట మనిషిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు వనదుర్గా ప్రాజెక్టులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేశామన్నారు.
సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు అర్హులని చెప్పారు. 18 నుంచి 45 సంవత్సరాల వరకు చిన్న మహిళలు సంగారెడ్డిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.