Medak

News June 15, 2024

సంగారెడ్డి: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం

image

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి ఫిరంగి శుక్రవారం తెలిపారు. ఈనెల 30లోగా https://studycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్‌ను ఫాలో కావాలని సూచించారు.

News June 14, 2024

మెదక్: వీడిన జంట హత్యల మిస్టరీ

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మే23న వెలుగు చూసిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. 25రోజుల క్రితం బంగారం కోసం తల్లిదండ్రులను వారి కొడుకే హత్య చేసినట్లు గుర్తించారు. జల్సాలకు అలవాటు పడ్డ లక్ష్మణ్ డబ్బు కోసం తల్లిదండ్రులను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News June 14, 2024

సంగారెడ్డి: రేపు ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు

image

బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపాధ్యాయులకు ఈనెల 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకుని మెడికల్ బోర్డు ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని డిఇఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News June 14, 2024

సార్వత్రిక ఫలితాల్లో సంగారెడ్డి ఫస్ట్.. సిద్దిపేట లాస్ట్

image

ఓపెన్(సార్వత్రిక) పది, ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. పదో తరగతితో 79.6% ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా ఫస్ట్ స్థానంలో నిల్వగా.. 77.95 %తో మెదక్ ద్వితీయ, 42.65% సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్‌లో సంగారెడ్డిలో 67.03 %, మెదక్ 60.16%, సిద్దిపేటలో 37.18% ఉత్తీర్ణత నమోదైనట్లు సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

News June 14, 2024

ధరణి సమస్యలు పరిష్కరించాలి: సీసీఎల్ఏ

image

పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాలపై సమీక్షించి వాటిని పరిష్కరించడంపై ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్ మనూచౌదరి పాల్గొన్నారు.

News June 14, 2024

సిద్దిపేట: మహిళపై దాడి చేసి పుస్తెలతాడు చోరీ.. ఇద్దరి అరెస్ట్

image

ములుగు మండలం తునికి బొల్లారం వాసి శ్యామల శంకరమ్మ దాడి చేసి 4.50 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మేడ్చల్ జిల్లా నాగలూరుకి చెందిన లింగని రజినీకాంత్(23), ఈరగల్ల యాదగిరి(36)గా గుర్తించినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. శంకరమ్మ ఈనెల 11న ఉదయం వాకింగ్ చేస్తుండగా దాడి చేసి పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. తూప్రాన్‌లో అమ్ముతుండగా ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు.

News June 14, 2024

గుమ్మడిదల: రోడ్డు ప్రమాదంలో బైక్ మెకానిక్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్‌ను ఢీకొని బైక్ మెకానిక్ మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండలంలో నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన గణేష్(31) బైక్ మెకానిక్. నిన్న రాత్రి తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం తిరిగి కారులో ఇంటికి వస్తుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

News June 14, 2024

సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు

image

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

News June 14, 2024

హాట్‌టాపిక్‌గా ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు

image

మెదక్‌లో జరిగిన విజయోత్సవ సభలో బీఆర్ఎస్ నేతలపై ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారినాయి. మాజీ సీఎం KCRపై ఇప్పుడే ఈడీ కేసు నమోదైందని, త్వరలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై ఈడీ ఎఫెక్ట్ ఉంటుందని, రూ.500 కోట్లు ఖర్చుపెట్టినా వెంకట్రామిరెడ్డి గెలవలేదన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై జిల్లాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మీ కామెంట్..

News June 13, 2024

మెదక్: విద్యుత్ సబ్ స్టేషన్‌లో పిడుగుపాటు

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామతీర్థం శివారులోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌పై పిడుగు పడింది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగుపాటు జరిగింది. దాంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి విద్యుత్తు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు.