India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మేరకు బ్లడ్ బ్యాంకుల నిర్వహణ – బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలను పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్వేతకు తన భర్తకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్వేత ఇద్దరు పిల్లలతో కలిసి అమీన్‌పూర్ పెద్ద చెరువులో దూకింది. బాలుడు శ్రీహాన్స్ మృతదేహం లభించగా బాలిక శ్రీహ, తల్లి శ్వేత మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అందోలు మండల పంచాయతీ అధికారిణి(MPO) సౌజన్యను సస్సెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారని MPDO రాజేశ్ కుమార్ తెలిపారు. MPO పని తీరుపై ఇటీవల మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు చేయడం, ఇతరత్రా కారణాలపై జిల్లా కలెక్టర్ ఖేడ్ DLPO సంజీవరావుతో విచారణ చేయించారు. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు MPDO తెలిపారు.
వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పనితీరును సమీక్షించారు. వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధులు, దోమల కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, చికున్ గన్యా, ఫైలేరియా, డెంగీని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
‘ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం టీచర్లుగా మీ బాధ్యత’ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాయికోడ్‌లో బుధవారం నిర్వహించిన ‘బడి బాట’లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులపై ప్రజల ఆలోచన విధానం మార్చుకోవాలని, ఆ బడులు మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని సూచించారు. ప్రైవేటుకు దీటుగా విద్య బోధన కొనసాగేలా చూడాలని కోరారు.
ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దశలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్యోగుల సమస్యలు లేవనెత్తగా పైవిధంగా స్పందించారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామానికి చెందిన గోపి(30) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన గోపి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మరణించారు. మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన వి.నగేష్(40) వ్యవసాయ పొలం వద్ద స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరు పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతిచెందాడు.
దీని విద్యుత్ అధికారులే నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు గ్రామంలో ధర్నా చేశారు. అలాగే మెదక్‌లోని గాంధీనగర్‌లో గుట్ట కిందిపల్లికి చెందిన చింతల నర్సింలు మైక్ వైర్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు.
నేడు, రేపు ఉమ్మడి మెదక్‌కు వర్ష సూచన ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, మెదక్, సిద్దిపేటలో ఓ మోస్తరు వర్షం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షసూచనతో మెతుకుసీమ రైతులు సాగుకు సిద్ధమయ్యారు.
టాంకాం ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం జర్మనీ భాష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిని వందన తెలిపారు. ఆసక్తి గలవారు www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టాంకాం మొబైల్ యాప్‌లో సైతం దరఖాస్తులు సమర్పించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.