India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాల సంఖ్య 1,018కు చేరాయి. ఇందులో 814 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఇతర పనులు చేయిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.34.80 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పటివరకు రూ.8.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
సిద్దిపేట పట్టణంలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి చెందాడు. లింగారెడ్డిపల్లికి చెందిన జాన్ బాబు-సంగీతల కుమారుడు గిరీశ్ (17) బాసరలోని త్రిబుల్ ఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సెలవుల్లో భాగంగా ఇంటికి వచ్చిన అతను సిమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లాడు. లోతుగా ఉన్న పూల్‌లో దూకడంతో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్ట నిమిత్తం తరలించారు.
ఝరాసంగం మం. గుంతమర్పల్లి గ్రామానికి చెందిన భార్గవ రెడ్డి పొలంలో నిన్న సాయంత్రం మొసలిని గుర్తించారు. వ్యవసాయ పనులు చేసేందుకు చెత్త కుప్పలు, కర్రలు తొలగిస్తుండగా మొసలి కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులకు సమాచారం ఇవ్వగా.. తహశీల్దార్ సంజీవరావు, SI రాజేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చీకటి కావడంతో గుర్తించలేదు. మొసలి సంచారం విన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించే విషయంలో హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. హోటల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తహసిల్దార్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధరణి దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కడారి శ్రీశైలం అనే రైతు వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో పిడుగు పడి స్పృహ కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉండగా వైద్య చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తీసుకెళ్తున్న క్రమంలో శ్రీశైలం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్‌ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్‌ఛార్జుల పదవీకాలం పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
ములుగు మండలం వంటిమామిడిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉంటున్న మహిళపై బంగారం కోసం గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం దాడి చేశారు. మహిళ బయటకు వచ్చిన క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సుత్తెతో దాడి చేసి మహిళ మెడలో నుంచి బంగారాన్ని అపహరించుకుపోయారు. మహిళకు తీవ్ర రక్తస్రావం అవడంతో ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 2024-26వ విద్యా సంవత్సరానికిగాను డీసెట్-24 నోటిఫికేషన్ వెలువడినట్లు మెదక్ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ, పూర్వ ప్రాధమిక ఉపాధ్యాయ శిక్షణ కోసం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత పరీక్ష ఆన్లైన్లో జులై 10న నిర్వహిస్తారన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT
Sorry, no posts matched your criteria.