Medak

News June 10, 2024

ఓయూ: 19వ తేదీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.

News June 10, 2024

నేడు పల్లె నిద్రలో మెదక్ కలెక్టర్, అధికారులు

image

మెదక్ జిల్లాలో బడిబాట విజయవంతానికి కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నర్సాపూర్ మండలం జక్కపల్లిలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు పల్లె నిద్ర చేయనున్నారు. చదువుకోవడం వల్ల మానసిక పరిపక్వత సాధించవచ్చని, చదువు చాలా ఉన్నతమైనది చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి, ప్రతి ఒక్క అధికారి 100 ఇళ్లు సర్వే చేయాలన్నారు.

News June 10, 2024

నేడు పల్లె నిద్రలో మెదక్ కలెక్టర్, అధికారులు

image

మెదక్ జిల్లాలో బడిబాట విజయవంతానికి కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నర్సాపూర్ మండలం జక్కపల్లిలో కలెక్టర్ రాహుల్ రాజ్ పల్లె నిద్ర చేయనున్నారు. చదువుకోవడం వల్ల మానసిక పరిపక్వత సాధించవచ్చని, చదువు చాలా ఉన్నతమైనది చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి, ప్రతి ఒక్క అధికారి 100 ఇళ్లు సర్వే చేయాలన్నారు.

News June 10, 2024

ఓయూలో బీఎఫ్ఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) (అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ) తదితర కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు రెండు, మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 13వ తేదీలోగా చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 20వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.

News June 10, 2024

MDK: వాహనదారులకు DGP సూచనలు

image

వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.

News June 10, 2024

MDK: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

వర్షాకాలం ఆరంభం కానున్న సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఏటా ఆషాఢం, శ్రావణమాసంలో ధరలు పెరిగి సామాన్యులను కుదేలు చేస్తుంటాయి. మెదక్ జిల్లాలో గతేడాది సరైన వర్షాలు పడకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈసారి స్థానికంగా కూరగాయల సాగు, దిగుబడి తగ్గింది. పది రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 నుంచి 80 ఉండగా.. ప్రస్తుతం రూ.120 పలుకుతోంది.

News June 10, 2024

MDK: ఎందుకు ఓడిపోయాం..?

image

ఉమ్మడి మెదక్ జిల్లా BRSకు కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల ఫలితాలలో కారు జోరుకు బ్రేకులు పడటంతో BRS శ్రేణుల్లో ఎందుకు ఓడిపోయామనే అంతర్మథనం జరుగుతోంది. రాష్రంలోనే గెలుపొందే సీట్లలో మెదక్ స్థానం తప్పక ఉంటుందని భావించారు. కానీ, అంచనాలు తలకిందులయ్యాయి. BRS మూడో స్థానంలో నిలించింది. పట్టు ఉన్న జిల్లాలో ఓటమి చెందటాన్ని నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.

News June 10, 2024

రైతుబంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు !

image

తెలంగాణలో రైతులు వానాకాలం పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నంగునూరు మండలం అక్కనపల్లిలో మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వర్షం పడగానే రైతుబంధు ఇచ్చేదని .. కానీ రేవంత్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు.

News June 10, 2024

మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో మెదక్ ఎంపీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడవ సారి ప్రమాణ స్వీకారోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో జరిగిన ప్రధాని మోదీ, మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గొడెం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

News June 9, 2024

SRD: జాతీయ పురస్కారం అందుకున్న టీచర్ రామకృష్ణ

image

సదాశివపేట మండలానికి చెందిన నిజాంపూర్( కె) పాఠశాల ఉపాద్యాయులు డా. రామకృష్ణ (విద్యా సామాజిక చైతన్యం కృషి) జాతీయ బంగారు కామధేనువు పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వ సాంసృతిక శాఖ సౌజన్యంతో GCS వల్లూరి ఫౌండేషన్ గ్రూప్ జాతీయ బంగారు అవార్డుల ప్రదానోత్సవ రవీంద్రభారతిలో జరిగింది. BC కార్పొరేషన్ ఛైర్మన్ వాకుళాబరణం కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారం అందజేశారు.