India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన బాగమ్మ(55) అనే వృద్ధురాలు గత నెల 1న అడవిలో వంట చెరుకు తేవడానికి వెళ్లి అదృశ్యమైంది. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అడవి ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది బాగమ్మ మృతదేహంగా గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు.
ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన మాట్లాడుతూ.. తనలో రెండోసారి ఈ పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
జోగిపేట శివారులో మృతి చెందిన మొసలిని స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పట్టణంలోని రాజరాజేశ్వరి ఆలయం ససమీపంలోని అటవీ ప్రాంత కాలువల్లో నుంచి వచ్చిన మొసలి అక్కడే మృతి చెందింది. రెండు, మూడు రోజుల క్రితమే ఇది చనిపోయి ఉండొచ్చని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మూడో మారు ప్రధాన మంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ చరిత్ర పుటల్లో ఎక్కారు. గ్లోబల్ లీడర్ రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడు, ఈ రోజు ఢిల్లీలో 3వ సారి భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీకి నారాయణఖేడ్‌కు చెందిన ఆర్టిస్ట్ శుభాకాంక్షలు చెప్పారు. రావి ఆకులపై ఆయన చిత్రాలు రూపొందించి అభిమానాన్ని చాటుకున్నాడు.
మెతుకు సీమలో 25 ఏళ్ల అనంతరం కాషాయ జెండా రెపరెపలాడింది. లోక్‌సభ స్థానం ఏర్పడిన అనంతరం BJPకి ఇది రెండో విజయం. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆలే నరేంద్ర BRS నుంచి బరిలో దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి 2019 వరకుగెలుపొందుతూ వచ్చింది. వరుసగా 5సార్లు గెలిచినా (ఉపఎన్నికతో కలిపి) ఈసారి చతికిలపడిపోయింది. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కావడం పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులు బదిలీ కానున్నారు. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పని చేసిన అధికారులకు స్థాన చలనం తప్పకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో జిల్లాల్లో మంచి పోస్టింగ్‌ల కోసం అప్పుడే స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రుల వద్దకు అధికారులు పరుగులు తీస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 21,762 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉ.9 గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.10 గంటల వరకు అనుమతించి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గేట్లు మూసివేసి అభ్యర్థులను అనుమతించరని పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని ఇందిరాకాలనీలో శనివారం జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాలు.. నాందేడ్ యాదిగిరి మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుండటంతో 6 నెలల క్రితం భార్య ఉష పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం బంధువులు వారీ మధ్య రాజీ కుదుర్చగా.. ఉష భర్త దగ్గరకు వచ్చింది. ఈక్రమంలో మళ్లీ గొడవ జరగగా మనస్తాపంతో యాదిగిరి ఉరేసుకున్నాడు.
మెదక్‌లో 2004 నుంచి 2019 వరకు వరస విజయాలతో దూసుకెళ్లిన BRS ఈఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRS 5,96,048 ఓట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో 3,96,790 ఓట్లతో సరిపెట్టుకుంది. 2019లో BJPకి 2,01,567 ఓట్లు రాగా, 2024లో 4,71,217 ఓట్లు సాధించి BRS కంచుకోటపై కాషాయ జెండా ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో BRS మూడో స్థానానికి పరిమితం కావడం పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.
నేడు జరగనున్న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులను 8:30 గం. నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 10 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
Sorry, no posts matched your criteria.