India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటక రాష్ట్రంలోని పెద్ద వడగవ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంగ్టి మండల వాసి మృతి చెందాడు. మండల పరిధిలోని తడ్కల్ గ్రామానికి చెందిన కటికే తోసిఫ్ (20) శనివారం బీదర్ నుంచి బైక్ పై తడ్కల్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. దీంతో తోసిఫ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సన్పూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తూప్రాన్ పట్టణంలోని కొత్తచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైన సంగారెడ్డి చెందిన నర్సింలు (50) మృతదేహం అభ్యమైంది. నిన్న ఉదయం తూప్రాన్‌కు చెందిన టేకు పోచయ్య, జెడిగాడి దేవేందర్‌లతో కలిసి నరసింహులు కొత్తచెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళాడు. అందులో పడిన గాలం తీసేందుకు చెరువులోకి దిగి గల్లంతయ్యాడు. ఈరోజు నర్సింలు మృతదేహం లభించింది.
అందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ నర్సింహులు శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. 18ఏళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో తనదైన శైలిలో గ్రామంలోని ప్రజలకు ఎన్నో సేవలను అందించారు. ఈయన మృతి పట్ల మండల డీలర్ల సంఘం తీవ్ర సంతాపం తెలిపింది. ఎల్లప్పుడూ ప్రజానీకంలో ఉంటూ ప్రజల మన్ననలు పొందారని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రోల్ల జోగినాథ్ అన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన వ్యక్తి రామోజీ అన్నారు.
అమీన్‌పూర్ లేక్‌లో పడి <<13398783>>మహిళ మృతి<<>>చెందింది. స్థానిక సాయిరాం హిల్స్‌లో ఉంటున్న జయశ్రీ(25), రవిజేత దంపతులు.. జనవరిలో డైవర్స్‌కు అప్లై చేశారు. అప్పటి నుంచి ఏపీలోని పిఠాపురంలోని పుట్టింట్లో జయ.. గత నెల 26 రవి తండ్రి మృతిచెందడంతో తిరిగి వచ్చింది. శుక్రవారం భర్త, కూతురి(4)తో కలిసి వెళ్లగా చెరువులో పడిపోయి చనిపోయింది. అయితే జయ ప్రమాదవశాత్తు పడిందా లేక దూకి ఆత్మహతకు పాల్పడిందా..? అని తెలియాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో వరి సాగుపై రైతులు అయోమయంలో పడిపోయారు. గతంలో 80% దొడ్డు వడ్లు, 20% సన్న రకాలు సాగుచేసే వారుగా ప్రస్తుతం బోనస్ ప్రకటనతో అయోమయంలో పడ్డారు. సిద్దిపేట జిల్లాలో గత వానకాలంలో 3,32, 006 ఎకరాలు, యాసంగిలో 3,48,009 ఎకరాల్లో సాగైంది. మెదక్ జిల్లాలో గత వానకాలంలో 3,00,967, యాసంగిలో 1,85,295 ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో గత వానకాలంలో 1,04,000 ఎకరాలు, యాసంగిలో 1,03,000 ఎకరాల్లో వరి సాగు చేశారు.
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం ( ఈ నెల 10) నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నేరుగా వచ్చి తమ తమసమస్యలను వినిపించవచ్చున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా రాజ్ పల్లిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మార్గం సిద్దిరాములు(55) కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులు చేయడానికి వెళ్లారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షంతోపాటు పిడుగు పడింది. సిద్దిరాములు మృతిచెందగా భార్య రాధమ్మ, మరో మహిళా మౌనిక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.
మెదక్‌లోని జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ వైమానిక దళ అధికారులతో కలిసి అగ్నిపథ్ పోస్టర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత వైమానిక దళం వారు అగ్నివీర్ వాయు అనే పేరుతో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యువతీ, యువకులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయాశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
చిలిపిచేడ్ మండలం చిట్కుల్‌లో పిడుగుపాటుకు ఒక మహిళ రైతు మృతిచెందింది. గ్రామానికి చెందిన బోయిని నర్సమ్మ (50) తమ వ్యవసాయ పొలం వద్ద పనులు పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామశివారులోకి రాగానే పిడుగుపాటుకు గురై నర్సమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.