India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 9న జరిగే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద CRPC 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని,10 గంటల కే గేట్లు మూసివేస్తారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారన్నారు. హాల్ టికెట్, పెన్ మాత్రమే తీసుకొని రావాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 2019-24 ఏప్రిల్ వరకు 877 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 498 మంది మరణించారు. 828 మంది గాయపడ్డారు. ఇటీవల మక్తల్ శివారులో కర్ణాటక బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు జాగ్రత్తలపై ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రేమజంట <<13393123>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాలిలా.. మృతుడి సోదరులు ఒకే ఇంటి నుంచి అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. వదిన చెల్లెలిని ప్రేమించిన సదానందం.. ఆ యువతినే పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒకే కుటుంబం నుంచి ఒకే ఇంటికి ముగ్గురు కోడళ్లుగా వెళ్లడం మంచిది కాదని భావించి పెళ్లికి నిరాకరించారు. దీంతో వారిద్దరు నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈనెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం న్యాల్కల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కాకి జనవాడకు చెందిన బావ, మరదలు సదానందం(24), ఉమ(20) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఫుల్ కుర్తి వద్ద మంజీర నదిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఘటనా స్థలంలో మృతుల బైకు, సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్‌లో రైల్ కింద పడి 35 ఏళ్ల వయసు గల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. వేగంగా వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. గుర్తిస్తే సమాచారం తెలియచేయాలని రైల్వే ఎస్సై తావు నాయక్ వివరించారు.
కోర్టు ధిక్కరణకు పాల్పడిన DSP, SIలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్లాపూర్ గ్రామంలోని భూవివాదంలో భూయజమాని కర్ణాకర్ కోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో అప్పటి తూప్రాన్ DSP యాదగిరి రెడ్డి, SI రవి కాంతారావుకు చెరో రూ.2000 ఫైన్ విధించారు.
మెదక్ ఎంపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు 35 ఓట్లు పడ్డాయి. పటాన్‌చెరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1,316 ఓట్లు రాగా, గజ్వేల్ 728, మెదక్ 452, సిద్దిపేట 648, దుబ్బాక 590, నర్సాపూర్ 397, సంగారెడ్డి 451ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 44మంది పోటీలో ఉండగా 41మంది డిపాజిట్ కోల్పోయారు. BJP, INC, BRSకు కలిపి మొత్తం 13,00,085 ఓట్లు, గుర్తింపు పొందిన పార్టీలకు 48,040, స్వతంత్రులకు 33,497 ఓట్లు వచ్చాయి.
మెదక్ జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మరణించారు. హవేలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం మల్లన్న గుట్ట ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్దయ్య( 50), ఓడంగల నందు(22)లు మృత్యువాత పడ్డారు. అడవిలోకి వెళ్లిన వీరి కోసం నిన్న సాయంత్రం నుంచి కుటుంబీకులు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఉదయం అడవిలోకి వెళ్లిన వారికి ఇద్దరు చనిపోయి కనిపించారు.
మెదక్ MP స్థానాన్ని దక్కించుకోవాలని చూసిన BRSకు నిరాశే మిగిలింది. ఇక్కడ ఏడుకు 6 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌లో సరాసరి ఓట్లు వచ్చినా.. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోవటంతో పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత MLA ఎన్నికలతో పోల్చితే తాజాగా సిద్దిపేటలో BRSకు 40,013, గజ్వేల్‌లో 26,252, దుబ్బాకలో 31,165 ఓట్లు తగ్గాయి.
Sorry, no posts matched your criteria.