India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నారాయణఖేడ్ పట్టణంలో శతాధిక వృద్ధుడు వీల్ చైర్ పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మొహమ్మద్ ఖాదర్ సాబ్ (101) గర్ల్స్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 169 లో వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మెదక్ లోక్ సభ పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం73.63%
పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా
గజ్వేల్- 73.15 %
సిద్దిపేట- 73.15 %
దుబ్బాక- 80.22 %
మెదక్- 79.61 శాతం
నర్సాపూర్- 83.73 శాతం
పటాన్ చెరువు -61 శాతం
గజ్వేల్-79.07 శాతం
సంగారెడ్డి- శాతం రావాల్సి ఉన్నది. సంగారెడ్డి రిపోర్టు వస్తే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో నివాసముండే మధ్యప్రదేశ్‌కు చెందిన ఊర్మిళ ఊకే (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి వివరాలు.. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న ఊర్మిళ అదే రాష్ట్రానికి చెందిన జైన్ లాల్ వర్కడేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లలను వదిలి ఏడాదిన్నరగా కాళ్లకల్‌లో కంపెనీలో పని చేస్తున్నారు. పిల్లల మీద బెంగతో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది.
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. 5PMవరకు మెదక్‌లో 71.33, జహీరాబాద్‌లో 71.91 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ వివరాలు..
⏵మెదక్-76.82, దుబ్బాక-78.69, గజ్వేల్- 76.41, నర్సాపూర్-81.15, పటాన్‌చెరు-58.94, సంగారెడ్డి-68.48, సిద్దిపేట-69.25
⏵జహీరాబాద్-70.54, ఆందోల్- 73.69, నారాయణ్‌ఖేడ్-70.83, బాన్సువాడ-73.99, జుక్కల్-72.91, కామారెడ్డి-67.79, ఎల్లారెడ్డి-74.74 శాతం నమోదైంది.
ఉమ్మడి జిల్లాలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగియనుంది. 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి ఓటు వేసి అవకాశం కల్పిస్తారు. కావున ఇప్పటివరకు ఓటు వేయని వారు ఓటర్లు త్వరగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పదండి ఇంకా ఓటేసి మీ నాయకుడిని ఎన్నుకోండి.
లోక్ సభ ఎన్నికల్లో ఓటేయడానికి యూఎస్ నుంచి రావడం విశేషం. మెదక్ పట్టణానికి చెందిన మెంగని యామిని ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడానికి ఆమె తిరిగి వచ్చారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన అనన్య ఎరుగు మొదటిసారిగా ఓటు వేయడం ఎంతో అనుభూతినిచ్చిందని చెప్పారు. ఇది మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రజాస్వామ్యం కల్పించిన బాధ్యతగా పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మ.1గంటల వరకు మెదక్ పరిధిలో 46.72, జహీరాబాద్‌లో 50.71 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా.. ⏵మెదక్-53.17, నర్సాపూర్-53.75, సంగారెడ్డి-44.25, పటాన్‌చెరు-38.61, సిద్దిపేట-44.36, దుబ్బాక-50.38, గజ్వేల్- 49.57 ⏵జహీరాబాద్-47.42, ఆందోల్-30.48, నారాయణ్‌ఖేడ్-51.57, జుక్కల్-53.62, బాన్సువాడ-53.59, ఎల్లారెడ్డి-54.20, కామారెడ్డి-47.46 శాతం నమోదైంది.
లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు ⏵శాంతి భద్రతల ఆటంకం ⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం ⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ ⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం ⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు ⏵అసత్య వార్తలు వ్యాప్తి
ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 9గంటల వరకు మెదక్ పరిధిలో 10.99, జహీరాబాద్‌లో 12.88 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..
⏵ మెదక్-12, నర్సాపూర్-12.24, సంగారెడ్డి-10.14, పటాన్‌చెరు-9.15, సిద్దిపేట-11.10, దుబ్బాక-13.06, గజ్వేల్- 11.12,
⏵జహీరాబాద్-11.84, ఆందోల్-11.48, నారాయణ్‌ఖేడ్-12.71, జుక్కల్-12.58, బాన్సువాడ-15.71, ఎల్లారెడ్డి-14.17, కామారెడ్డి-12.49 శాతం నమోదైంది.
మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగానికి ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఐడీఓసీ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
Sorry, no posts matched your criteria.