India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిద్దిపేట జిల్లాలో బుధవారం వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్ కుమార్(17) పిడిచేడు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన నక్క కాంతయ్య(55) కారు, ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందాడు. దుబ్బాక మండలం పద్మనాభునిపల్లికి చెందిన రాజయ్య(87) ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా టాటా ఏస్ వాహనం ఢీకొని మృతిచెందాడు.

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలను ఈనెల 5న సంగారెడ్డిలోని డా. బీఆర్ అంబేద్కర్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎండీ జాబిద్ అలీ తెలిపారు. 8, 10, 12ఏళ్ల బాలబాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఇందులో ఎంపికైన వారు ఈ నెల 7న గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు.

ఉమ్మడి జిల్లాలో RRR నిర్మాణానికి 80 శాతం సర్వే పూర్తి కావడంతో అధికారులు భూ సేకరణకు కసరత్తు చేస్తున్నారు. RRR ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 110KM ఉండటంతో 4,500 ఎకరాల భూమిని సేకరిస్తారు. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు, అందోల్-జోగిపేట, గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి పరిధిలో మొత్తంగా 54 గ్రామాల్లో భూమి తీసుకుంటారు. అటు ప్రభుత్వ నిర్ణయంపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భూ నిర్వాసితులు అంటున్నారు.

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ ఆఫీస్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు డిజిటల్ సంతకంతో ప్రతి ఫైలు ఈ ఆఫీసు ద్వారా తనకు పంపించాలని అన్నారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్‌గా స్వీకరించడం జరగదని ఈ ఆఫీస్ ద్వారా రావాలని అన్నారు. ఆయా శాఖల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఆయా శాఖల అధికారులు, పాల్గొన్నారు.

ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇఓగా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏడుపాయల దేవాదాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంచార్జీ ఈవోగా పని చేసిన వినోద్ రెడ్డిని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఏసీగా నియమించడంతో ఆయన స్థానంలో కృష్ణ ప్రసాద్‌ను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. రాహుల్ గాంధీ కుటుంబానికి త్యాగాల చరిత్ర ఉందని, మోసాల చరిత్ర బీజేపీ, మోదీదేనని ఎద్దేవా చేశారు. త్వరలో దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీశ్ దయతో మోదీ ప్రధాని అయ్యారని విమర్శించారు.

విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారంలో జరిగింది. స్థానికుల వివరాలు.. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన లైన్ మెన్ చంద్రశేఖర్, మరో లైన్ మెన్ విద్యుత్ లైన్‌ను బాగు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగగా చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

MLA పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని MLA హరీశ్‌రావు ఖండించారు. ‘ప్రజల సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా..? ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనా..?, ఇలాంటి బెదిరింపులకు BRS భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం’ అని హరీశ్‌రావు Xలో పేర్కొన్నారు.

టోల్‌గేట్ ట్యాక్స్ చెల్లించడానికి ఫాస్టాగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేయబోగా ఖాతాలో డబ్బులు మాయమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. అమీన్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి కారు ఫాస్టాగ్ రీఛార్జి చేసినా అవ్వకపోవడంతో కొత్తగా యాప్‌ను డౌన్ లోడ్ చేయబోతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి లింక్ పంపాడు. UPI నంబర్ నమోదు చేయమని చెప్పి, ముందుగా ఒక్క రూపాయి డ్రా చేశాడు. తర్వాత రూ.48.920 మాయం కాగా PSలో ఫిర్యాదు చేశాడు.

బ్రెయిన్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన కోటగిరి రాజు(35) కొద్ది రోజులుగా తలలో నొప్పితో బాధపడుతూ సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్ చేశారని, పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.