India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన పటాన్‌చెరు అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కిష్టారెడ్డిపేటలో ఉంటున్న అరుణ్(22) స్నేహితులతో కలిసి దాయెరలోని క్వారీ గుంతలోని నీటిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. నీటిలోకి వెళ్లిన అరుణ్ పైకిరాలేదు. చీకటి పడుతున్న పైకి రాకపోవడంతో ఇంటికెళ్లి తల్లి ఉమకు సమాచారమిచ్చారు. ఆదివారం పోలీసులు పరిశీలించగా మృతదేహం కనిపించింది.
సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో జరగాల్సిన బడి బాట కార్యక్రమాన్ని ప్రభుత్వ వాయిదా వేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరిగి బడి బాట ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వం త్వరలోనే తేదీలను ప్రకటించనుందని పేర్కొన్నారు.
జహీరాబాద్ ఎంపీ ఓట్ల లెక్కింపునకు గీతం వర్సిటీలో మొత్తం 98 టేబుళ్లు- 145 రౌండ్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉన్న జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి సెగ్మెంట్లల్లో లెక్కింపు ప్రక్రియ తొలుత పూర్తి కానుంది. చివరిలో అందోల్, జహీరాబాద్ ఫలితాలు తేలనున్నాయి. అందోల్, జహీరాబాద్‌లో 23 రౌండ్లలో లెక్కింపు కారణంగా 5:30గ.కు పైగా సమయం పట్టనుంది. విజేత ఎవరో మధ్యాహ్నం తెలిసే అవకాశం ఉంది.
వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్న భార్యాభర్తలను HYD పాతబస్తీ పరిధి హుమాయున్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలో 100 గ్రా. గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదీశ్వర్ తెలియజేశారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సిరాజ్ ఖాన్, రింకు డోలాయి భార్యాభర్తలు. సిరాజ్ ఖాన్ సంగారెడ్డి జిల్లా ముత్తంగి హోటల్‌లో పనిచేస్తున్నాడు. వీరు మెహదీపట్నంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు.
నేటి నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 783 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మెదక్ లోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను www.bse.telanganaa.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
మెదక్ లోక్‌సభలో 103 టేబుళ్లపై ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్క తేలనుంది. మెదక్, సిద్దిపేట సెగ్మెంట్లు 14 టేబుల్స్ -20 రౌండ్లు, నర్సాపూర్ 14 టేబుల్స్ -22 రౌండ్లు, దుబ్బాక 14 టేబుల్స్- 19 రౌండ్లు, గజ్వేల్ 15 టేబుల్స్- 22 రౌండ్లు, పటాన్‌చెరు 18 టేబుల్స్- 23 రౌండ్లు, సంగారెడ్డి 14 టేబుల్స్- 21 రౌండ్లు, పోస్టల్ బ్యాలెట్ 18 టేబుల్స్- 2 రౌండ్లలో లెక్కిస్తారు. 650మందితో పోలీస్ బందోబస్తు చేస్తున్నారు.
లోక్ సభ ఓట్ల లెక్కింపు సిబ్బంది రెండవ రాండమైజేషన్ కలెక్టర్ ఛాంబర్లో పూర్తి చేశారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, కౌంటింగ్ అబ్జర్వర్ల సమక్షంలో కలెక్టర్ రాహుల్ రాజ్ 7 నియోజక వర్గాల కౌంటింగ్ సిబ్బంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సిబ్బందిని, కౌంటింగ్ సూపర్ వైజర్స్, మైక్రో అబ్జర్వర్స్ సిబ్బందిని కేటాయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో మెతుకుసీమ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. పలు సర్వేలు మెదక్, జహీరాబాద్ పరిధిలో బీజేపీ గెలుస్తుందని చెప్పడంతో నాయకులు మందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. మెదక్ నుంచి రఘునందన్ రావు, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పోటీలో ఉన్నారు. కొన్ని సర్వేలు మెదక్‌లో ముక్కోణపు పోటీ ఉంటుందని, జహీరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గుర్రపు శ్రీనివాస్ కుమారుడు బద్రీనాథ్(17) హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షలు రాశాడు. వారం కిందట అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతోపాటు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర వీరులను స్మరిస్తూ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమర వీరుల స్థూపానికి హరీష్ రావు నివాళులర్పించారు.
Sorry, no posts matched your criteria.