India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దౌల్తాబాద్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (39) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహేశ్వరి వివాహం తొగుట లక్ష్మణ్ తో జరగ్గా, కుమారుడు హర్షవర్ధన్ జన్మించాడు. ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న మహేశ్వరి కొడుకు భవిష్యత్తు గురించి మదన పడుతూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గురువారం రాత్రి అనుమానాస్పదంగా <<13346047>>యువకుడు మృతి<<>> చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అహ్మదీపూర్ గ్రామానికి చెందిన జమాల్పూర్ సోనీబాయి(34)తో నరేశ్ చారి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో సోని కూతురిపై నరేశ్ కన్నేశాడని గమనించి, పలుమార్లు మందలించింది. అయినా వినకపోవడంతో కొడుకు జమాల్పూర్ కిషోర్‌తో కలిసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు గజ్వేల్ ACP పురుషోత్తంరెడ్డి తెలిపారు.
మెదక్ లోక్‌సభ పరిధిలో 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యనే పోటీ నెలకొన్నది. నెలరోజుల పాటు సాగిన ప్రచార పర్వంలో నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డారు. ఆయా పార్టీల అధినేతలు సైతం తమ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. గెలిచేదెవరో అనే ఉత్కంఠ ఎక్కువైంది.
మెదక్, జహీరాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనావేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా ఈ రెండుస్థానాల్లో కొన్ని బీజేపీ, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా ఉత్కంఠ నెలకొంది.
మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైంది. ఈసందర్భంగా కలక్టరేట్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ కాంతుల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
మెదక్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ BJP నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, BRS నుంచి వెంకట్రామ్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చాణుక్య x సర్వే అంచనా వేసింది. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని ఆసక్తి నెలకొంది. దీనిపై మీ కామెంట్?
మెదక్ పార్లమెంట్ స్థానం బీజేపీదే అని PL SURVEY అంచనా వేసింది. BRS నుంచి వెంకట్రామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, BJP నుంచి రఘునందన్‌రావు పోటీలో ఉన్నారు. కాగా తొలుత త్రిముఖ పోరు ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో BRSదే విజయమని అంచనా వేసింది. జహీరబాద్ పార్లమెంట్ స్థానం BJP అని అంచనా వేసింది.
మెదక్ పార్లమెంట్ స్థానం బీజేపీదే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ BJP నుంచి రఘునందన్‌రావు, BRS నుంచి వెంకట్రామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీలో ఉన్నారు. కాగా తొలుత బీజేపీ, కాంగ్రెస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీదే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన రెండు ఎంపీ స్థానాలలో గెలుపు ఎవరిది అనే అంశంపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉండడంతో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడవ విడత సార్వత్రిక ఎన్నికల అంకం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి.
మార్చి 2024లో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అనుత్తీర్ణులైన విద్యార్ధుల కోసం జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరిక్షలు నిర్వహిస్తున్నట్లు డిఇఓ రాధాకిషన్ తెలిపారు. మెదక్ జిల్లాలో 783 మంది విద్యార్థులుండగా, మెదక్ పట్టణ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఉ. 9.30 గం. నుంచి మ.12.30 గం వరకు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.