India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 18వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న కాలువ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో కాళేశ్వరం కాలువ పనులు ప్రారంభమై నర్సాపూర్ మండలం నాగులపల్లి వరకు కొనసాగున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పనులు నిలిచిపోవడంతో నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు. కాలువ పూర్తైతే తమ పొలాలకు నీళ్లు వస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.
శివంపేట మండలానికి చెందిన యువకుడు సౌత్ ఆఫ్రికాలో మృతి చెందారు. మండల పరిధిలోని కొంతాన్‌పల్లికి చెందిన నర్సాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్ చిన్న కుమారుడు కీర్తి తేజ(24) సౌత్ ఆఫ్రికాలోని రువాండాలో గుండెపోటుతో నిన్న మృతి చెందాడు. కీర్తి తేజ మరణ వార్త తెలుసుకున్న కుటుంబికులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు నేడు బోయినపల్లిలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
మెదక్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుల్ ఏర్పాటు చేశామని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 4న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందన్నారు. ఇదంతా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. గత MP ఎన్నికల్లో మెతకుసీమ ఓటర్లు మెదక్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS), జహీరాబాద్‌లో బీబీ పాటిల్(BRS)ను గెలిపించుకొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
రేపు HYD పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సోనియా గాంధీ, ఉద్యమకారులు, అమరుల కుటుంబీకులను భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమంలో KCR కీలకం కావడంతో CM రేవంత్ ఆయనకూ ఆహ్వానం పంపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మన్ హర్కర వేణుగోపాల్ ఇన్విటేషన్ అందించారు. మరి CM పిలుపుతో KCR వస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్దిపేట జిల్లా ముస్తాబవుతోంది. జూన్ 2 అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యేక లైటింగ్‌తో ధగధలాడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం(కలెక్టరేట్) విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా మారింది. జాతీయ జెండా రంగులతో శుక్రవారం రాత్రి న్యూ లుక్‌తో చూపరనులను ఆకట్టుకుంంటుంది.
జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 16 కేంద్రాల్లో 9,672 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. 6 ఎస్కార్ట్ రూట్లుగా విభజించి ఆర్మూడ్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముగ్గురు నిందితులకు సిద్దిపేట కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చందన 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లిలో ఈనెల 28న ఎస్సీ వర్గానికి చెందిన హనుమాన్ మాలదారులు ఆలయంలోకి వెళ్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారికి రిమాండ్‌కు తరలించారు.
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడటంతో ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. MDK, ZHBలో విజయంపై పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో మెదక్‌లో గెలుపు మాదంటే మాదే అని నాయకులు సవాళ్లు చేసుకుంటున్నారు. మెదక్‌లో ముక్కోణపు పోటీ నెలకొనడంతోపాటు మాజీ సీఎం కేసీఆర్ సొంత ఇలాకా కావడంతో మెతుకుసీమ ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తుది ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ పరిధిలోని సంఘ భవనంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు రావలసిన నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.