India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న 3 రోజుల అకాల వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులు తడవకుండా భద్రపరచాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో కప్పి ఉంచాలన్నారు. అనంతరం పీపీసీ కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లకు, రైతులకు ధాన్యం తడవకుండా చేపట్టాల్సిన చర్యలపై పలుసూచనలు చేశారు.
పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అప్పటినుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,557 కేసులు నమోదు చేసి, 683 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. రూ. 8.89 కోట్ల విలువైన అక్రమ మద్యం, కల్లు, నాటుసారా, గంజాయి తదితర పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈమధ్య పటాన్ చెరులో రూ. 9.23 కోట్ల విలువచేసే ఎంఎంసీ మత్తు పదార్థం సీజ్ చేశామన్నారు
పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన కుకునూర్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుకునూర్‌పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. కుకునూర్‌పల్లికి చెందిన కుమ్మరి మల్లేశం(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనుల నిమిత్తం వ్యవసాయం బావి దగ్గరకి వెళ్లాడు. అప్పుడే ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగుపడింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు.
శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన కలకుంట లక్ష్మీ (45) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం ఉపాధిహామీ పథకం కింద నిర్వహిస్తున్న పనుల వద్దకు పనులు చేసేందుకు వెళ్లింది. కూలీలతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయింది. గ్రామంలోని వైద్యుడికి చూపించగా మృతిచెందినట్లు తెలిపారు.
మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ సాహెల్ (24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. సాహెల్ మూడు సంవత్సరాల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించకపోగా.. వేరే సంబంధం చూసి పెళ్లికి నిశ్చయించారు. దాంతో మనస్తాపానికి గురైన సాహెల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నర్సాపూర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు నిర్వహించాల్సిన పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం 5 గం.కు జనజాతర సభ నిర్వహించేందుకు సీఎం రావాల్సి ఉండగా.. రద్దు చేశారు. ఈనెల 9న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభను రద్దు చేశారు. నేడు సీఎం సభ, 9న రాహుల్ గాంధీ సభలను రెండు రోజుల నిర్వహించడం ఇబ్బందిగా ఉండడంతో.. రద్దు చేసినట్లు సమాచారం.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం రాత్రి మెదక్ పట్టణానికి చేరుకోనుంది. కామారెడ్డి జిల్లా నుంచి రాత్రి 8 గంటలకు బస్సుయాత్ర మెదక్ పట్టణంలోకి ప్రవేశిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో బస్సుయాత్ర కొనసాగనుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 20,18,600 నగదు పట్టుబడ్డాయి. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 14,62,000 నగదు లభించింది. బేగంపేటలో రూ.2 లక్షలు, గజ్వేల్‌లో 1,22,500 లు, టేక్మాల్‌లో రూ. 1,21,700 లు, చిన్నకోడూరు రూ. 1,11,400 లు నగదు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ నగదును సీజ్ చేశారు.
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సాపూర్‌కు వస్తున్నారని నియోజకవర్గ ఇన్చార్జ్ రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ నర్సాపూర్ పర్యటన రద్దయిందని వారు తెలిపారు.
ఎన్నికల నిర్వహణ కోసం అదరపు పోలింగ్ సిబ్బందికి ఈనెల 7, 8 తేదీల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. శిక్షణలో పోలింగ్ సిబ్బంది సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు. శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.