India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సులు పూర్తి చేసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్‌టైం ఛాన్స్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. అన్ని సెమిస్టర్ల పరీక్ష ఫీజును వచ్చే నెల 20వ తేదీలోగా, రూ.500 అపరాధ రుసుముతో 25వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. అందరూ ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ భూ సేకరణకు అవార్డు ఇయరింగ్ సమావేశం నిర్వహించారు. భూ సేకరణ అధికారి ఆర్డిఓ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెంకటాయపల్లి, నర్సంపల్లి గ్రామాలకు సంబంధించి 3G అవార్డు ఎంక్వయిరీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. సక్రమంగా అవార్డు చేయలేదని పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాల కోసం ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
టీ-పీసీసీ పదవిపై ఆ పార్టీ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష పదవిని అడిగే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందన్నారు. బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదన్నారు. ఇక బీఆర్ఎస్‌లో అయితే మరొకరికి అవకాశమే రాదని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ధైర్యంగా పదవిని అడగవచ్చని వెల్లడించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్ లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా వాటిని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కౌడిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సురేశ్ ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఈరోజు ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు చూసి అతడిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతిచెందాడని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వడదెబ్బ తాళలేక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఎవరైనా తప్పిపోయి ఉంటే నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
రామాయంపేట BRS ప్రెసిడెంట్‌పై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. పట్టణానికి చెందిన గణేశ్ ఎకరం భూమి డెవలప్‌మెంట్ కోసం నాగరాజుతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. శనివారం పెద్దమ్మ ఆలయం వద్ద కూర్చుకున్నారు. ఈ టైంలో గణేశ్ నాగరాజుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదైంది.
తండ్రి కళ్ల ముందే కొడుకు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జరిగింది. కొత్త స్వామి-నాగమణికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో వినోద్(10) తండ్రితో కలిసి పశువులను మేపడానికి వెళ్లాడు. ఈక్రమంలో సమీపంలోని చెక్‌డ్యాంలోకి పశువులు వెళ్లడంతో వాటిని బయటకు తీసుకురావాలనే తొందరలో నీటిలో మునిగిపోయాడు. స్వామికి ఈత రాకపోవడంతో కొడుకు మునిగిపోతున్నా చూసి రోదించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు.
Sorry, no posts matched your criteria.