India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో అదివారం రాత్రి కోళ్ల ఫారం గోడకూలి తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన గంగ గౌరీ శంకర్(30), హైదరాబాద్ చంద్రాయణగుట్టకు చెందిన భాగ్య(40) మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బంధువులందరూ ఒకేచోట కోళ్ల ఫారం వద్ద నిలబడగా గోడ కూలింది. మరో నలుగురు గాయపడ్డారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. ఈరోజు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. రేగోడు 44.4, కొల్చారం 44.2, పోడ్చన్ పల్లి 44.1, కల్హేర్, నాగపూర్ 43.8, కట్కూరు 43.6, శివంపేట, అంగడికిష్టాపూర్ 43.4, మిన్ పూర్, ప్రగతి ధర్మారం 43.1, తుక్కాపూర్ 43.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లాకు ఆరంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా భర్త దేవేందర్ రెడ్డికి షాక్ తగిలింది. DCCB డైరెక్టర్, కోనాపూర్ పీఏసీఎస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఈమేరకు శనివారం డీసీసీబీ సమావేశంలో తీర్మానించారు. సొసైటీ ఛైర్మన్‌గా రూ.2.26కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. రైతుల సొమ్మును రికవరీ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
సినీ ఫక్కీలో కళ్లల్లో కారం చల్లి <<13306483>>23న కిడ్నాప్<<>> చేసిన వెంకటేశం మిస్టరీపై సస్పెన్స్ వీడింది. మహరాష్ట్రలోని ఉద్గార్లో అక్కడి పోలీసులు అతడి మృతదేహన్ని శనివారం కనుగొన్నారు. కల్హేర్ మండలం కృష్ణాపూర్కి చెందిన వెంకటేశం మృతదేహంగా గుర్తించారు. భార్య విజయతో పాటు గ్రామస్థులను పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు. వెంకటేష్‌ను హత్య చేసింది బంధువులుగా తెలుస్తుండగా వారు జుక్కల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి జాయింట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తామని సిద్దిపేట కమిషనర్ డాక్టర్ అనురాధ పేర్కొన్నారు. దుకాణాలలో, ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలలో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లకు వేర్వేరు మార్గాలు ఉంటాయని చెప్పారు. ఆమె వెంట అధికారులు ఉన్నారు.
మెదక్ జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి వద్ద హైవే-44పై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందారు. హైవే దాటుతున్న వ్యక్తిని హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ముప్పిరెడ్డిపల్లికి చెందిన <<13316285>>మూల నరేందర్<<>>(55) మనోహరాబాద్ వద్ద ముందు జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు.
గజ్వేల్ పట్టణంలోని సీడ్స్ & ఫర్టిలైజర్ షాపుల్లో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ సైదా తనిఖీలు నిర్వహించారు. 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలు, మెంతులు గంగవాయిలు కూర, బీర్నిస్, వరి ధాన్యం, కొన్ని రకాల పురుగుల మందులు ఫర్టిలైజర్స్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
SRD: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సులకు ఆల్ ఇండియా కోటా స్కీమ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తీసుకున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ కోటా కింద ఇప్పటివరకు 103 సీట్లు అందుబాటులో ఉండేవని, ఈ నిర్ణయంతో అదనంగా 350 సీట్లకు ఛాన్స్ ఉంటుందన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన దోమకొండ సాయి(20) ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాళ్లకల్‌లో నివాసముండే సాయి మూడు రోజులుగా కనిపించకుండా పోయారు. ఈరోజు గ్రామ శివారులోని మాదన్న కుంటలో మృతదేహం దొరికింది. సాయి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.