Medak

News May 24, 2024

సంగారెడ్డి: ‘ఎరువుల కొరత లేకుండా చూడాలి’

image

జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సహకారంతో విత్తన దుకాణాలు తనిఖీలు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు పాల్గొన్నారు.

News May 24, 2024

MDK: ప్రతి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలు

image

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కొల్చారం మండలం వరిగుంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.
వరిగుంతం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుదిదశలో ఉన్నందున త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేసి మిల్లుకు తరలించాలని నిర్వహకులను ఆదేశించారు.

News May 23, 2024

5ఏళ్లు రేవంత్ రెడ్డే CM: జగ్గారెడ్డి

image

5ఏళ్లు రేవంత్ రెడ్డే CMగా ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్రి ఉత్తమ్‌పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదు. ఉత్తం వైట్ పేపర్ లాంటివారు. ఆయనపై ఇంక్ చల్లకండి. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం, మంత్రులు చెప్పారు. అయినా అధికార పార్టీపై ప్రతిపక్షాలు బురదజల్లడం సహజమే’ అని జగ్గారెడ్డిని అన్నారు.

News May 23, 2024

BRS నేత హత్యను ఖండించిన హరీశ్ రావు

image

వనపర్తి జిల్లాలో BRS నేత శ్రీధర్‌ హత్య ఘటనను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 5నెలల్లోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే ఇద్దరు BRS నేతలు హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్‌ భయపెట్టలేదన్నారు. BRS శ్రేణులు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందన్నారు.

News May 23, 2024

మెదక్: అదృశ్యమైన వ్యక్తి.. పొలంలో మృతి

image

మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యద్ మౌలానా బాష(60) అనే వృద్ధుడు బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. ఈరోజు వ్యవసాయ బావిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మౌలానా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

News May 23, 2024

సంగారెడ్డి: రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

జిల్లాలో ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి తెలిపారు. గురువారం సంగారెడ్డిలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 14, 886 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని చెప్పారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

News May 23, 2024

మెదక్: పెట్రోలు పోసి నిప్పంటించి హత్య

image

నర్సాపూర్‌లోని రాయరావు చెరువు ప్రాంతంలో రెండు <<13294262>>మృతదేహాలు <<>>బయపడిన విషయం తెలిసిందే. CI , SI ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎక్కడో ఇరువురి గొంతులకు ఉరి బిగించి హత్య చేశాక ఇక్కడికి తరలించి పెట్రోలు పోసి తగల బెట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇరువురి మృతదేహాలపై దుస్తులు లేవు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 22, 2024

సిద్దిపేట: కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు సస్పెన్షన్

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI <<13292456>>నాగరాజును సస్పెండ్<<>> చేస్తూ మల్టీజోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ఐజీ నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ భార్య మానస తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకుని కుమారులను ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

News May 22, 2024

మెదక్: సైలెంట్ మోడ్‌లో నాయకులు..!

image

పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నాయకులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈసారి ఓటరు నాడి తెలియకపోవడంతో మెదక్‌ ఎంపీగా ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరికి వారుగా గెలుపు పై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల రిజల్ట్‌పై ఆందోళనలో ఉన్నారు. పోటాపోటీగా ప్రచారం చేసినా గెలుపుపై అభ్యర్థులు, నాయకులతోపాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే తుది ఫలితాల కోసం జూన్ 4వ వరకు వేచి చూడాల్సిందే.

News May 22, 2024

వెల్దుర్తి: ఇంట్లో ఉరేసుకొని యువతి సూసైడ్

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావుడే శ్రీను, యాదమ్మ దంపతుల 3వ కుమార్తె పావని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే పావని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.