India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం లక్ష్యం. “యోగం” అనే పదం సంస్కృత మూలం. దీని అర్థం “చేరడం”, “కలయిక” లేదా “ఏకం చేయడమని ఖేడ్ కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ తెలిపారు. ఈ మేరకు తన అరచేతిపై యోగ కార్యక్రమాల చిత్రాలను పెయింట్ వేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈనెల 24 నుంచి 29 వరకు జరుగనున్న TGPSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సూచనలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా సూచించారు. గిరిజన సంక్షేమ, ఎస్సీ అభివృద్ధి, బీసీ అభివృద్ధి శాఖ గ్రేడ్1 & 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమంలో మార్టన్ గ్రేడ్1 & గ్రేడ్ 2, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో లేడీ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి.

మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతిపత్రం అందజేశారు. పటాన్చెరువు నుండి మెదక్, అక్కన్నపేట వరకు రైల్వే లైన్ పొడగింపు, మెదక్, సిద్దిపేట స్టేషన్ల నుంచి తిరుపతికి రైల్వే సర్వీస్ ప్రారంభం సహా పలు సమస్యలను లేఖలో వివరించారు.

మెదక్ పార్లమెంటు సీటు BRS గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని, మెదక్ పార్లమెంట్‌లో ఆరడుగులు ఉన్నోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని ఎంపీ రఘునందన్ అన్నారు. మెదక్‌లో తాను దెబ్బకొడితే BRS అడ్రస్ లేకుండా పోయిందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన BJP కార్యకర్తల అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడారు. టైటానిక్ షిప్ లా BRS పరిస్థితి తయారయ్యిందని విమర్శించారు.

జూలై 1 నుంచి అమలు కానున్న నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన ఉండాలని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కళ్యాణమండపంలో పోలీసు అధికారులకు నూతన చట్టాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై అవగాహన కలగాలంటే నేర్చుకోవాలనే తపన ఉండాలని చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

మెట్రో రైలును మియాపూర్ నుంచి పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ అన్నారు. సంగారెడ్డిలో నిన్న రాత్రి జరిగిన కార్యకర్తల అభినందన సభలో మాట్లాడారు. సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలు తప్పకుండా తెస్తానని హామీఇచ్చారు. ఈ విషయంలో త్వరలో మెట్రో సీఎండీని కలుస్తానన్నారు. గత ప్రభుత్వాలు సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు.

గుండె వ్యాధితో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఖేడ్ మండలం సంజీవనరావుపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేకరీ సాయిలు నందిని దంపతుల ఆరేళ్ల కూతురు సాయి పల్లవి గత నెల రోజుల నుంచి గుండె వ్యాధితో నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. గుండె ఆపరేషన్‌కు రూ. 6లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దాతలు విరాళాలు అందించినప్పటికీ చివరికి ఆ చిన్నారి గుండె ఈరోజు ఆగిపోయింది.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ పసిబిడ్డను వదిలిపెట్టి వెళ్లిన ఘటన KNR జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలానికి చెందిన యువతి, వరుకోలుకు చెందిన మహేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చిన యువతి KNRలోని మాతాశిశు ఆసుపత్రిలో చేరింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తల్లి పసిబిడ్డను వదిలివెళ్లడం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆ పసిబిడ్డకు ఇతర తల్లుల పాలు పట్టిస్తున్నారు.

గడ్డి మందు తాగి ఈనెల 14న రంజిత్ చికిత్స పొందుతూ మృతిచెందిన కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాబా శేఖర్, బిక్కనూర్‌కి చెందిన రంజిత్ కలిసి కొద్దిరోజుల క్రితం ఓ బైక్‌ను దొంగిలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆ బైక్‌ను తానే సొంతం చేసుకోవాలని బాబా శేఖర్ తన బావమరిది రంజిత్‌కు కళ్ళు సీసాలో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సీఐ వెల్లడించారు.

ఈనెల 7 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో 8,019 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 1వ తరగతిలో 3,501, 2 నుంచి 9వ తరగతిలో 3,896 మంది చేరినట్లు చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 642 మంది చేరినట్లు వివరించారు. బడిబాట విజయవంతం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.
Sorry, no posts matched your criteria.