India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆందోల్ మండలం జోగిపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ ముందు రైతులు జీలుగ విత్తనాల కోసం పట్టా పాసు బుక్కులు, చెప్పులను క్యూ లైన్‌లో పెట్టారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఒకవైపు వర్షంలో తడుస్తూ నానా తంటాలు పడుతుంటే.. మరో వైపు భూమి సారవంతం కావడానికి జీలుగు విత్తనాల కోసం అనేక పాట్లు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం నేటితో ముగియనుంది. మూడేళ్ల క్రితం వీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన క్యాంపస్‌లోని వైస్ ఛాన్సలర్ నివాసంలో ఉంటూ 21 పాయింట్ ఫార్ములాతో నిత్యం వర్సిటీ అభివృద్ధికి పాటుపడ్డారు. PHD విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఇచ్చి వందలాదిమంది పూర్వ విద్యార్థులకు డాక్టర్ డిగ్రీలను అందుకునేలా అవకాశం కల్పించారు. త్వరలో ఓయూకి కొత్త వీసీ రానున్నట్లు సమాచారం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. మనోహరాబాద్‌కు చెందిన నాగరాజు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకోగా.. రాయపోల్‌కు చెందిన నర్సయ్య కడుపు నోప్పితో ఉరేసుకున్నాడు. ఇదే క్రమంలో కల్హేర్ మండలం నాగధర్‌కు చెందిన అశోక్ కుటుంబ కలహాలు, అనారోగ్యంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వ్యక్తి 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు, తెల్లటి షర్ట్, నలుపు రంగు పాయింట్ ధరించారని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ స్థానాల్లో BRSను గెలిపించేందుకు హరీశ్‌రావు ముమ్మర ప్రచారం చేశారు. సభలు, రోడ్ షోలు, ర్యాలీలతో హోరెత్తించారు. మరోవైపు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మైనంపల్లి హనుమంతరావు సైతం రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఇప్పటికే సిద్దిపేట రాజకీయంపై కన్నేసిన మైనంపల్లి.. హరీశ్ రావుపై తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఈక్రమంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మీ కామెంట్?
మెదక్ జిల్లాలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను గిరిజన బాలబాలికల నుంచి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కోరారు. 3, 5, 8వ తరగతులలో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 12న కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు డ్రా పద్ధతిన ఎంపిక నిర్వహిస్తున్నట్లు వివరించారు.
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలికేరి అన్నారు. కొనుగోలు కేంద్రాల సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి ఎగుమతి, దిగుమతి, మిల్లింగ్ స్టోరేజ్ కెపాసిటీ సమస్యల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవానీ మాతా ఆలయం హుండీ ఆదాయం రూ.47,50,681 వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి, ఛైర్మన్ సాతెల్లి బాలాగౌడ్ తెలిపారు. సోమవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో భ్రమరాంభిక సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గోకుల్ షెడ్‌లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
శివంపేట మండలం భీమ్లా తండాకు చెందిన సంతోశ్ తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడని భార్య శిరీష ప్రజావాణిలో మెదక్ ఎస్పీ బాలస్వామికి ఫిర్యాదు చేశారు. 2021లో తన వివాహం జరగ్గా ఒక బాబు పుట్టినట్లు తెలిపింది. అనారోగ్యం కారణంగా తాను తల్లి గారి ఇంటి వద్ద ఉండగా మార్చిలో సంతోశ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ ఘటనపై విచారించాలని శివంపేట ఎస్సైని ఎస్పీ ఆదేశించారు.
బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవులకు జూటా హామీలు..ఇదీ రేవంత్ పాలన అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేవరకొండకు హరీశ్‌రావు వెళ్లి రవీంద్ర కుమార్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవరకొండలో హరీశ్ మీడియాతో మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.