India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కంచన్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న నరసయ్య (55)ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 60కి పైగా కంపెనీల్లో 5వేల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో 18-35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించింది. వివరాలకు 9642333667, 6300670339 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలు అనన్య(3), సహస్ర(1)ను నీటిలో ముంచి హత్య చేసేందుకు యత్నించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా.. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ మారనున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాతో పాటు బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇకపై తన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానాలని ఆయన హితవు పలికారు.

ఫేస్‌బుక్‌లో ప్రకటన ద్వారా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు చూపిస్తామంటూ ఆశ చూపి రూ.12.52 లక్షలు కాజేసిన ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పోచారంలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి ఫేస్‌బుక్ ప్రకటన చూసి ఓ వాట్సప్ గ్రూప్‌లో చేరింది. APR 12 నుంచి JUN 14 వరకు రూ.13.8 లక్షలు పెట్టుబడి పెట్టగా వాటిలో రూ.1.30 వెనక్కి తీసుకుంది. మిగతావి రాకపోవడంతో PSలో ఫిర్యాదు చేసింది.

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో గుండెపోటుతో ఇద్దరు మృతిచెందారు. గంటల వ్యవధిలోనే అత్త, అల్లుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన నరసింహులు(58) ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. అల్లుడి మరణం తట్టుకోలేక రోదిస్తున్న అత్త నర్సమ్మ సైతం ఈ ఉదయం గుండెపోటుకు గురై మృతిచెందారు.

సిద్దిపేట జిల్లాలో 8 విడతల్లో జరిగిన హరితహారంలో సుమారు 15 కోట్ల వరకు మొక్కలు నాటారు. రహదారుల వెంట, ఖాళీ స్థలాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పల్లెలు, పట్టణాల్లో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించాయి. విద్యుత్ వైర్లకు తగులుతున్నాయనే సాకుతో సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల అనేక చోట్ల విద్యుత్ సిబ్బంది నరికి వేశారు.

పెళ్లి చేయడంలేదన్న మనస్తాపంతో<<13453836>> యువకుడు సూసైడ్<<>> చేసుకున్నాడు. SI అంబార్య వివరాలు.. మహారాష్ట్రకు చెందిన బాలాజీ(31) కుటుంబం కొన్నేళ్లుగా తిమ్మాపూర్‌లో ఉంటుంది. HYDలో పనిచేస్తున్న బాలాజీ.. తనకు పెళ్లి చేయాలని కోరుతున్నా కుటుంబీకులు పట్టించుకోలేదు. ఇటీవల గ్రామానికి వచ్చిన బాలాజీ ఆదివారం తాగిన మైకంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. బాలాజీ తల్లి మీరాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

త్యాగానికి ప్రతీకైన ఈద్-ఉల్-అజ్ హ (బక్రీద్) పర్వదినాన్ని ఇస్లామిక్ కాలమానిని హిజ్రీ క్యాలండరు ఆఖరి నెల జిల్ హిజ్జాలోని పదో తేదీన ముస్లింలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండగను పురస్కరించుకుని సోమవారం ముస్లింలు ప్రత్యేక నమాజు చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు, మదర్సాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు.

కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన విష్ణువర్ధన్(20) మేడ్చల్‌లోని RTC కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఏదైనా పనిచేసుకోవాలని విష్ణును శనివారం రాత్రి తండ్రి మందలించారు. దీంతో ఆవేశంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.