Medak

News May 19, 2024

మెదక్: ఆర్టీసీకి ఎన్నికల్లో సమకూర్చిన ఆదాయం

image

మెదక్ రీజియన్ పరిధిలో మే11 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 887బస్సు సర్వీసులు నడిపించగా ఈ నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.4.29 కోట్ల ఆదాయం సమకూరిందని మెదక్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ప్రభులత తెలిపారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ఓటు వేయడానికి వచ్చే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిత్యం నడిపే బస్సులతో పాటు ఆధారంగా సర్వీసులకు నడిపించారన్నారు. సిబ్బంది కూడా కష్టపడి పని చేశారన్నారు.

News May 19, 2024

సిద్దిపేట: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

image

మద్యం మత్తులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన లారీ డ్రైవర్ శనివారం సరుకులు దింపి తిరిగి వెళుతున్న క్రమంలో సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో లారీ అదుపు తప్పింది. చౌరస్తాలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంకు వద్ద ఫౌంటేన్‌లోకి లారీని ఎక్కించాడు. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

News May 19, 2024

మెదక్: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ ఆత్మహత్య

image

మనస్తాపం చెందిన ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లి మృతదేహంగా లభ్యమైంది. కొల్చారం ఎస్ఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాలు.. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన మల్లయ్య, రాజమ్మ దంపతులకు ఒక్క కుమార్తె సుజాతను రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈనెల 16న తల్లి రాజమ్మ, సుజాతలకు గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంజీరా నదిలో శవం లభ్యమైంది. భర్త రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్సై తెలిపారు.

News May 19, 2024

దుబ్బాక: అప్పులు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో యువత ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని మనోవ్యధకు మిగులుస్తోంది. ఈ విషపు క్రీడ గ్రామాల్లోకి పాకింది. గ్రామీణ యువకులు కూడా ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లు కాస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నెలకు సుమారు 15 వరకు ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో సుమారు 22 శాతం మంది యువత ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలవుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది.

News May 19, 2024

మెదక్: ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటి వరకు 44,685 మంది రైతుల నుంచి 1,94,666 టన్నులు సేకరించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 34 బాయిల్డ్, 23రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించినట్లు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు సిద్దిపేట జిల్లాకు 10 వేల టన్నులు పంపినట్లు తెలిపారు. రానున్న 5 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 19, 2024

సిద్దిపేట: గ్రూప్-1 అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు

image

సిద్దిపేటలోని BC స్టడీ సర్కిల్ కేంద్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులను చేపట్టనున్నట్లు డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ పేర్కొన్నారు. గ్రూప్-1కి సంబంధించిన పరీక్షలు ఈ నెల 18న ప్రారంభమై 20, 22, 25, 27, 29, 31 జూన్ 1, 3వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణార్థులు మినహాయిస్తే మిగిలిన అభ్యర్థులు WWW.tsbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 18, 2024

TS స్థానంలో TGగా మార్చాలి: కలెక్టర్

image

TS స్థానంలో TGగా మార్చాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే TS స్థానంలో TGని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో టీజీగా మార్చాలన్నారు.

News May 18, 2024

MDK: TS స్థానంలో TGగా మార్చాలి: కలెక్టర్

image

ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే TS స్థానంలో TGని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు. మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతులు రాగా, తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో TGని వినియోగించేందుకు అనుమతి లభించిందన్నారు.

News May 18, 2024

ఇంటి నుండి వెళ్లి.. శవమైన మౌనిక

image

నిజాంపేట మండలం కొత్తపల్లి శివారు పంట పొలంలో మహిళా మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. కల్హేర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బాచేపల్లి చెందిన కురుమ మౌనికగా గుర్తించారు. ఈనెల 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి లచ్చవ్వ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పంట పొలాల్లో మౌనిక మృతదేహం లభ్యం పట్ల పోలీసులు అనుమానిస్తూ హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News May 18, 2024

మెదక్‌లో 4 పాలిసెట్ పరీక్ష కేంద్రాలు

image

పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మెదక్ జిల్లా కేంద్రంలో 4 పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సువర్ణలత తెలిపారు. ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్ధార్థ ఆదర్శ జూనియర్ కళాశాల, సిద్ధార్థ మోడల్ హై స్కూల్‌లో ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు సమయానికి హాజరు కావాలని సూచించారు.