India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అకాల వర్షాలకు రైతులు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ధాన్యం దిగుబడులు పెరుగుతున్న పంట విక్రయించే సమయానికి అగచాట్లు పడాల్సి వస్తోంది. దిగుబడికి రైస్ మిల్లుల సామర్ధ్యానికి పొంతన లేక పోవడంతో తూకం వేసిన ధాన్యం నిలువలు పెరిగిపోయి ఎక్కడ నిల్వ ఉంచాలో అర్థం కాని పరిస్థితి ఉంది. జిల్లాలో 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ మేరకు మిల్లుల సామర్థ్యం లేదు.
ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి ఒక బాలిక నీటి తొట్టెలో పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు నరేశ్ కుమార్తె హరి చందన (15 నెలలు) గత రాత్రి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఊపిరాడక అందులోనే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హత్నూర మండలం సిరిపుర గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రియా తాండకు చెందిన గుగులోత్ పప్యా తన బైక్‌పై పని నిమిత్తం సంగారెడ్డికి వెళ్తుండగా, సిరిపురం గ్రామ శివారులో వెనక నుండి వచ్చిన డీసీఎం బైకును ఢీ కొట్టింది. దీంతో పప్యా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తండ్రిపై చేసి చేసుకుని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో చోటుచేసుకుంది. వల్లెపు యాదవ్వ-మల్లయ్యలకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు శేఖర్(24) ఉన్నారు. ఈనెల 11న తల్లిదండ్రులతో గొడవ జరగగా, కోపంతో శేఖర్ తండ్రిపై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో తప్పు తెలుసుకుని మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాల్సి ఉండగా చేయకపోవడంతో ఆఖరి సమయంలో పోలీసులు ఆపారు
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ తెలిపారు. గజ్వేల్ మండల పరిధిలోని జాలిగామ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.
కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ పట్టణంలోని అద్దాల మందిరం వద్ద అమ్మ వారి చిత్రాన్ని వడ్లను ఉపయోగించి అపురూపంగా రూపొందించి శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.
తన కారు నంబర్ (TS10FB9999)తో HYDలో మరో కారు తిరుగుతోందని మెదక్ MLA మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ మేరకు ఈరోజు కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ PSలో ఎమ్మెల్యే సిబ్బంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఓవర్ స్పీడ్ పేరిట తనకు చలాన్ వచ్చిందని, ఆ కారు తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన కారు నంబర్ ఎవరు వాడుతున్నారో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసానిపల్లి వద్ద 161వ జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు శ్రీనివాస్ (35), సునీత(30), కుమారుడు నగేశ్(7) మృతిచెందారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తాడ్కూర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు.
తన కారు నంబర్ (TS10FB9999)తో HYDలో మరో కారు తిరుగుతోందని మెదక్ MLA మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ మేరకు ఈరోజు కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ PSలో ఎమ్మెల్యే సిబ్బంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఓవర్ స్పీడ్ పేరిట తనకు చలాన్ వచ్చిందని, ఆ కారు తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన కారు నంబర్ ఎవరు వాడుతున్నారో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి పది ఫలితాల్లో 7.0 జీపీఏ ఆపైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోడానికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.