India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
EVMలల్లో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. దీంతో మెదక్, జహీరాబాద్‌లో అభ్యర్థులు లాభనష్టాలపై లెక్కలేసుకుంటున్నారు. ఓటర్ నాడి అంతు చిక్కకపోవడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన మొదలైంది. అయితే అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నప్పటికీ లోలోపల ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్, హరీశ్ రావు సొంత జిల్లా కావడంతో మెతుకుసీమ ఓటరు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉదయం 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా రామాయంపేట 62.5మి.మి, కొండపాక 51.5, గజ్వేల్ 44.0, చీకోడు 38.8, హబ్సిపూర్ 37.8, మాసాయిపేట 36.3, లకుడారం 35.8, బేగంపేట 35.5, కొడకండ్ల 34.0, నారాయణరావుపేట 31.3, మిన్పూర్ 30.5, కాగజ్ మద్దూర్ 30.3, అల్లాదుర్గం, పాల్వంచ 30.0 మి.మి వర్షపాతం నమోదయింది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) మృతిచెందాడు. USలోని నార్త్ కరోలినాలో 8ఏళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి బయటపడగా వేగంగా వచ్చిన మరో కారు వెనక నుంచి వీరి కారుని ఢీ కొట్టింది. దీంతో పృథ్వీ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 22 పాఠశాలల్లో ఆరవ తరగతికి, 10 ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ పాఠశాలలో చదివేవారికి బోధనతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని వివరించారు.
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులకు అభయమిచ్చారు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. రవాణా కోసం అదనపు వాహనాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్, చండూర్, కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ గ్రామాల్లో దాన్యం కొనుగోలు సెంటర్‌ను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించి ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకునే వారు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించి 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఏసీబీ వలకు నర్సాపూర్ పట్టణ వ్యవసాయాధికారి గురువారం చిక్కాడు. రూ.30 వేల లంచం తీసుకుంటున్న నర్సాపూర్ మండలం వ్యవసాయ అధికారి అనిల్ కుమార్‌ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో పట్టుకుని విచారణ చేపట్టారు. నర్సాపూర్‌లో ఒక అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఇటీవలి కాలంలో మెదక్ జిల్లాలో పలువురు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కారు.
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం వాసి నాగరాజు ఉదయ్ UK పార్లమెంట్ బరిలో నిలిచారు. యూకేలోని లండన్ యూనివర్సిటీలో పాలనాశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ స్థానం నుంచి ఆయన పోటీ పడనున్నారు. నాగరాజు మాజీ ప్రధాని పీవీ నరసింగరావుకు బంధువు. కొహెడ మండల వాసి యూకే పార్లమెంట్ బరిలో నిలవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలం(ఖరీఫ్) సీజన్ పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఏ పంట ఎంత మేరకు సాగు కానున్నది. ఇందుకు అనుగుణంగా ఏ రకం విత్తనాలు ఎంత మేరకు అవసరం అవుతాయని అంచనాలను రూపొందించారు. గత సీజన్ కంటే ఈసారి వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లాలో 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు, మెదక్ జిల్లాలో 3,73,509 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు తమ స్వస్థలాలకు పయనం కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. మెదక్ రీజియన్ పరిధిలోని ఎనిమిది డిపోల నుంచి ఎన్నికల నిమిత్తం 323 బస్సు సర్వీసులు అదనంగా నడిపారు. మరో 17బస్సులను ఏపీకి తిప్పారు. సుమారు 10, 36, 200 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశారు. దీంతో మెదక్ రీజియన్‌కు రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరింది.
Sorry, no posts matched your criteria.