Medak

News April 26, 2024

సంగారెడ్డి: 18 నామినేషన్లు తిరస్కరణ

image

జహీరాబాద్ లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లలో 14 మంది అభ్యర్థులకు చెందిన 18 నామినేషన్‌లు తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 40 మంది అభ్యర్థులు, 68 సెట్లు వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించినట్లు ఆమె చెప్పారు.

News April 26, 2024

మెదక్: 44.3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. తొగుట 44.3, దూల్మిట్ట 44.0, సిద్దిపేట 43.8, పొడ్చన్ పల్లి, కొండాపూర్ 43.6, శనిగరం, అన్న సాగర్ 43.4, చిట్యాల 43.3, బెజ్జంకి 43.2, పాశమైలారం 43.1, ప్రగతి ధర్మారం, కంది, బీహెచ్ఈఎల్ 42.9 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 26, 2024

హరీశ్ రావు దొంగ మాటలు మానాలి: జగ్గారెడ్డి

image

ఇప్పటికైనా మాజీ మంత్రి హరీష్ రావు దొంగ నాటకాలు మానాలని టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన అప్పటివరకు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాటలను రైతులు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

News April 26, 2024

మెదక్‌లో నామినేషన్ల పరిశీలన పూర్తి.. ఒకటి రిజెక్ట్

image

మెదక్ లోక్ సభకు వచ్చిన నామినేషన్ల పరిశీలన పూర్తైనట్లు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పరిశీలించారు. సరైన పత్రాలు సమర్పించని 1 ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించినట్లు రాహుల్ రాజ్ వెల్లడించారు. 53 నామినేషన్లకు ఆమోదం తెలిపారు. ఇందులో 18 మంది వివిధ రాజకీయ పార్టీల తరఫున, 35 మంది IND అభ్యర్థులు ఉన్నారు.

News April 26, 2024

మెదక్: ఊపందుకున్న ప్రచారం.. 

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ ఘట్టం ముగియడంతో పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించి గెలుపుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మెదక్ లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రచారం చేశారు.

News April 26, 2024

మోదీ సభను విజయవంతం చేయండి: బీబీ పాటిల్

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఈనెల 30న మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల గ్రామ శివారులో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నట్లు జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ తెలిపారు. సుమారు వంద ఎకరాల్లో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

News April 26, 2024

MDK: సోషల్ మీడియాలో వరుడి ఫోటోలు.. ఆగిన పెళ్లి !

image

మరో మహిళతో సంబంధం ఉందని పెళ్లికి ఒకరోజు ముందు వధువు బంధువులు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలో జరిగింది. స్థానికుల సమాచారం.. భర్తతో దూరంగా ఉంటున్న ఓ వివాహితతో వరుడు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చూసిన వధువు బంధువులు గురువారం వరుడి ఇంటికెళ్లి నిలదీశారు. గ్రామపెద్దల పంచాయితీలో పెళ్లి రద్దుతోపాటు సుమారు రూ.7లక్షల జరిమానా విధించినట్లు తెలిసింది. దీనిపై ఫిర్యాదు రాలేదని శివ్వంపేట పోలీసులు తెలిపారు.

News April 26, 2024

కాంగ్రెస్ జనజాతర సభకు ఏర్పాట్లు పూర్తి

image

జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పెద్దశంకరంపేటలో ఈరోజు సాయంత్రం జరిగే కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయినట్లు టీపీసీసీ సభ్యులు కర్నే శ్రీనివాసు పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కర్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న ఈ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ స్థానంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది.

News April 26, 2024

మెదక్: సోషల్ మీడియాలో ప్రచార జోరు..

image

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఆర్భాటాలు, ర్యాలీలు, మైకుల హోరు, ప్రచార వాహనాల జోరు ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌, అగ్రనాయకులను రప్పిస్తూ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఉదయం వాకింగ్‌లో యువతను పలకరిస్తున్నారు. ఇంటింటి ప్రచార బాధ్యతలను స్థానిక నేతలే చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

News April 26, 2024

సిద్దిపేట: ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. SI ప్రేమ్‌దీప్‌ వివిరాలు.. మనోహరాబాద్‌ మండలం పాలటకు చెందిన నితిన్‌(10) దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అమ్మమ్మతో కలిసి బుధవారం దౌల్తాబాద్‌లో పెళ్లికి వెళ్లిన నితిన్ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వచ్చాడు. వారు వచ్చేసరికే ఇంటి వద్ద మనవడు లేకపోవంతో స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామంలోని చెరువులో నితిన్‌ మృతదేహం తేలింది.