Medak

News March 20, 2024

25 నుంచి ఓయూలో సెల్ట్ తరగతులు

image

ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.

News March 20, 2024

మెదక్, జహీరాబాద్‌లో మొదలైన సందడి..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. కాగా మెదక్, జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS-8, కాంగ్రెస్- 5, BJP- 1 చోట విజయం సాధించాయి. కామారెడ్డిలో గెలిచిన బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

సిద్దిపేట: ‘మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందాం’

image

మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మెదక్ BJP అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులతో పాటు ఆయా మోర్చాల నాయకులు, శక్తి కమిటీలు, బూత్ కమిటీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

News March 20, 2024

మెదక్: పోలీసులమంటూ తనిఖీ.. బెదిరించి బంగారం అపహరణ

image

పోలీసులమంటూ బెదిరించి బంగారు అపహరించిన ఘటన సంగారెడ్డి మండలం చక్రియాలలో జరిగింది. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు బైకుపై సంగారెడ్డి నుంచి చక్రియాల వెళ్తుండగా MNR వద్ద నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ ఆపారు. కత్తితో బెదిరించి వారి వద్దనున్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 20, 2024

మెదక్: ప్రాణాలు బలిగొన్న గాలివాన

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గాలివాన రెండు ప్రాణాలు బలిగొంది. గజ్వేల్ మండలం <<12886470>>కొల్గూర్‌<<>>కు చెందిన పదోతరగతి విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జాజితండాలో మాన్‌సింగ్-మంజుల కుమార్తె సంగీత (6) సోమవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన గాలికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీకొంది. తీవ్రగాయాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

News March 20, 2024

 ఆధారాలు చూపి నగదు తీసుకెళ్లొచ్చు: సంగారెడ్డి కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పట్టుబడిన నగదుకు సంబంధించిన ఆధారాలను గ్రీవెన్స్ కమిటీకి చూపి తీసుకువెళ్ళొచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలను వెంట పెట్టుకోవాలని చెప్పారు. 10 లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఐటి శాఖకు సమాచారం అందిస్తామన్నారు.

News March 19, 2024

పటాన్‌చెరులో నీట మునిగి బాలుడు మృతి

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని గౌతమ్‌నగర్ సమీపంలో మూత పడ్డ పరిశ్రమలో వున్న నీటి గుంతలో నీట మునిగి నిహద్ (10) అనే బాలుుడు మృతి చెందాడు. నలుగురు చిన్నారులు నీటి గుంత వద్దకు ఈతకు వెళ్లగా ఓ చిన్నారి గడ్డపై కూర్చున్నాడు. నీటి గుంతలోకి దిగిన మరో ఇద్దరు రాహుల్ (14), ఫైసల్ (5)లను స్థానికులు రక్షించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News March 19, 2024

కొల్గూరులో చెట్టు విరిగిపడి బాలుడి మృతి

image

గజ్వేల్ మండలం కొల్గూరులో విషాధచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి చింటూ(15) వ్యవసాయ పొలం వద్ద గల పశువులను ఇంటికి తీసుకువస్తుండగా, భారీ గాలికి చెట్టు విరిగి అతడిపై పడింది. ఈ ప్రమాదంలో చింటూ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఓయూలో దరఖాస్తుల స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 19, 2024

మెదక్: రైలు నుంచి పడి యువకుడి మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం – మాసాయిపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్లోంచి పడి గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రయాణిస్తున్న రైల్లోంచి పడి యువకుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

error: Content is protected !!