India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మరణించారు. హవేలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం మల్లన్న గుట్ట ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్దయ్య( 50), ఓడంగల నందు(22)లు మృత్యువాత పడ్డారు. అడవిలోకి వెళ్లిన వీరి కోసం నిన్న సాయంత్రం నుంచి కుటుంబీకులు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఉదయం అడవిలోకి వెళ్లిన వారికి ఇద్దరు చనిపోయి కనిపించారు.

మెదక్ MP స్థానాన్ని దక్కించుకోవాలని చూసిన BRSకు నిరాశే మిగిలింది. ఇక్కడ ఏడుకు 6 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌లో సరాసరి ఓట్లు వచ్చినా.. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోవటంతో పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత MLA ఎన్నికలతో పోల్చితే తాజాగా సిద్దిపేటలో BRSకు 40,013, గజ్వేల్‌లో 26,252, దుబ్బాకలో 31,165 ఓట్లు తగ్గాయి.

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. 171 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా వారిలో 135 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇందులో 120 మంది బాలికలు, 15 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు 400లకు పైగా మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు విద్యార్థులకు మంత్రి పొన్నం అభినందనలు తెలిపారు.

అప్పుల బాధ భరించలేక యువరైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్న శంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణ వివరాలు.. మండలానికి చెందిన దడువాయి పరమేశ్వర్ (38) అనే రైతు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉంటాడు. కుటుంబ అవసరాల నిమిత్తం అతడు అప్పులు చేశారు. డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపం చెందిన పరమేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. గంట నుంచి కురుస్తున్న వర్షం సంగారెడ్డిలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. జిన్నారం మండల పరిధిలోని జంగంపేట్, మంగంపేట్, వావిలాల, ఊట్ల, రాళ్లకత్వ, శివనగర్, కొడగంచి, దాదిగూడెం, కొర్లకుంట, మంత్రి కుంట తదితర గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమం అయ్యాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ని జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన సురేష్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలిశారు. షేట్కార్‌ను రేవంత్ అభినందించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ ఇంచార్జి చంద్రశేఖర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ పాల్గొన్నారు.

మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఖాతా నుంచి BJP ఖాతాలోకి చేరిపోయింది. 2004 నుంచి 2019 వరకు రెండు దశాబ్దాలు మెదక్ బీఆర్ఎస్ MP అభ్యర్థులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో మారిన అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరణకు దూరమైంది. కంచుకోటగా భావించిన సిద్దిపేటలోనూ బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ తగిలింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఖాతా నుంచి బీజేపీలోకి వెళ్లింది.

మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఖాతా నుంచి BRS ఖాతాలోకి చేరిపోయింది. 2004 నుంచి 2019 వరకు రెండు దశాబ్దాలు మెదక్ బీఆర్ఎస్ MP అభ్యర్థులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో మారిన అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి తగ్గిపోయింది. కంచుకోటగా భావించిన సిద్దిపేటలోనూ బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ తగిలింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఖాతా నుంచి బీజేపీలోకి వెళ్లింది.

MP ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ముందు ఇక్కడ BRSVsBJP అని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. మెజార్టీ రౌండ్లలో BRS చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,72,078(13.92%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి MPగా పోటీ చేసిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 8న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు పంపిణీదారులు తడకంటి పర్వగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శంకర్ గౌడ్, లింగాగౌడ్ తెలిపారు. ఉబ్బసం, దగ్గు, దమ్ము వ్యాధితో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం అందజేయడం జరుగుతుందని వివరించారు. పూర్వీకుల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నందున పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.